AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSY and PPF: సుకన్య సమృద్ధి, పీపీఎఫ్‌ ఖాతాదారులకు అలెర్ట్‌.. ఆ పని చేయకపోతే ఖాతా ఇన్‌యాక్టివ్‌..!

బాలికల భవిష్యత్‌కు ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన పథకంతో పాటు, రిటైర్‌మెంట్‌ తర్వాత లైఫ్‌లో ఉపయోగపడే పబ్లిక్‌ ప్రావిడెంట్‌ పథకాలు ప్రజాదరణ పొందాయి. భవిష్యత్‌ కోసం పొదుపు పాటించే వారు కచ్చితంగా ఈ రెండు పథకాల్లో ఏదో ఒక దాంట్లో ఖాతాదారులుగా ఉన్నారు. అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) ఖాతాలను యాక్టివ్‌గా ఉంచడానికి కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించడం తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలను కూడా అమలులోకి తెచ్చింది.

SSY and PPF: సుకన్య సమృద్ధి, పీపీఎఫ్‌ ఖాతాదారులకు అలెర్ట్‌.. ఆ పని చేయకపోతే ఖాతా ఇన్‌యాక్టివ్‌..!
Money
Nikhil
|

Updated on: Jan 18, 2024 | 7:00 PM

Share

భారతదేశంలో ప్రజలను పొదుపు వైపు మళ్లించడానికి ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటుంది. ముఖ్యంగా అధిక వడ్డీని అందించేలా ప్రభుత్వ మద్దతుతో వచ్చే పెట్టుబడి పథకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇందులో బాలికల భవిష్యత్‌కు ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన పథకంతో పాటు, రిటైర్‌మెంట్‌ తర్వాత లైఫ్‌లో ఉపయోగపడే పబ్లిక్‌ ప్రావిడెంట్‌ పథకాలు ప్రజాదరణ పొందాయి. భవిష్యత్‌ కోసం పొదుపు పాటించే వారు కచ్చితంగా ఈ రెండు పథకాల్లో ఏదో ఒక దాంట్లో ఖాతాదారులుగా ఉన్నారు. అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) ఖాతాలను యాక్టివ్‌గా ఉంచడానికి కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించడం తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలను కూడా అమలులోకి తెచ్చింది. ఖాతాదారుడు మార్చి 31, 2024 వరకు ఈ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. అలా చేయకపోతే అతని ఖాతా ఇన్‌యాక్టివ్‌ అయిపోతుందని మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

పీపీఎఫ్‌

పీపీఎఫ్‌ ఖాతాదారుడు ఏడాదిలో కనీస బ్యాలెన్స్ రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే ఖాతా మూసేస్తారు. అయితే పీపీఎఫ్‌లో ఏడాదికి రూ.1.5 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టలేరు. ఈ సంవత్సరం పీపీఎఫ్‌ ఖాతాలో కనీస నిల్వను నిర్వహించడానికి చివరి తేదీ 31 మార్చి 2024గా ఉంది. ఈ తేదీ లోపు ఖాతాలో రూ.500 జమ చేయకపోతే ఖాతా స్తంభింపజేస్తారు. అయితే తర్వాత ఖాతాను మళ్లీ తెరవాలంటే మాత్రం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఖాతాదారుడు ఏడాదికి రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.  అంటే ఒకవేళ ఖాతా 2 సంవత్సరాలు నిష్క్రియంగా ఉంటే మళ్లీ యాక్టివేషన్ కోసం పెట్టుబడి మొత్తంతో పాటు రూ. 100 జరిమానా చెల్లించాలి.

సుకన్య సమృద్ధి యోజన

మినిమమ్ డిపాజిట్‌ లేకపోవడం వల్ల ఖాతా ఇన్‌యాక్టివ్‌గా మారితే ఆ ఖాతాపై ఎలాంటి రుణాన్ని పొందలేరు. సుకన్య సమృద్ధి యోజనలో మినిమమ్ డిపాజిట్‌ రూ. 250గా ఉంది. అంటే ఖాతాను యాక్టివ్‌గా ఉంచాలంటే ఆర్థిక సంవత్సరంలో రూ.250 పెట్టుబడి పెట్టాలి. రూ.250 కట్టడంలో విఫలమైతే ఖాతా ఇన్‌యాక్టివ్‌ అవుతుంది. సుకన్య ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయడానికి ఖాతాదారుడు సంవత్సరానికి రూ. 50 జరిమానా చెల్లించాలి. సుకన్య సమృద్ధి యోజనలో ప్రభుత్వం 8.2 శాతం వడ్డీని ఇస్తుంది. సుకన్య సమృద్ధి ఖాతాను ఆడపిల్ల పుట్టిన తర్వాత, ఆమెకు 10 ఏళ్లు నిండకముందే తెరవాలి. ఈ ఖాతాలో ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షలు జమ చేయవచ్చు. మీరు మీ సమీపంలోని బ్యాంక్ లేదా పోస్టాఫీసులో సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి