AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ ఘడియలు.. ఆ 92 నిమిషాలే కీలకం!

Akshaya Tritiya 2026: ఈసారి అక్షయ తృతీయ నాడు స్వాతి, విశాఖ నక్షత్రాలతో పాటు బ్రహ్మ, ఇంద్ర, గజకేసరి, మాలవ్య రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు ఏప్రిల్ 20న రవి యోగం కూడా తోడవుతోంది. ఈ కాలంలో బంగారం, వెండి లేదా రియల్ ఎస్టేట్ రంగంలో..

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ ఘడియలు.. ఆ 92 నిమిషాలే కీలకం!
Akshaya Tritiya 2026
Subhash Goud
|

Updated on: Apr 19, 2026 | 8:49 AM

Share

Akshaya Tritiya 2026: సనాతన ధర్మంలో ‘అక్షయ తృతీయ’ కు ఉన్న ప్రాముఖ్యత అపారం. ‘అక్షయ’ అంటేనే తరగనిది అని అర్థం. ఈ పవిత్ర దినాన ఏ చిన్న శుభకార్యం ప్రారంభించినా, ఏ వస్తువు కొన్నా అది అనంతమైన ఫలితాలనిస్తుందని మన నమ్మకం. ముఖ్యంగా 2026 అక్షయ తృతీయ నాడు ఐదు శక్తివంతమైన రాజయోగాలు కలవబోతుండటం విశేషం.

ఏప్రిల్ 19 లేదా 20? పండుగ ఎప్పుడంటే..

ఈ ఏడాది తృతీయ తిథి రెండు రోజులు రావడంతో కొంత గందరగోళం ఏర్పడింది. కానీ శాస్త్రోక్తంగా సూర్యోదయ తిథిని పరిగణనలోకి తీసుకుంటే:

తిథి ప్రారంభం: ఏప్రిల్ 19, ఆదివారం ఉదయం 10:49 గంటలకు.

తిథి ముగింపు: ఏప్రిల్ 20, సోమవారం ఉదయం 07:27 గంటలకు.

ముగింపు: ప్రధాన ముహూర్తాలన్నీ ఆదివారం నాడే ఉన్నందున, ఏప్రిల్ 19న పండుగ జరుపుకోవడం అత్యంత శ్రేష్టం.

ఆ 92 నిమిషాల ‘గోల్డెన్’ పూజా ముహూర్తం

లక్ష్మీనారాయణులను, కుబేరుడిని పూజించడానికి ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన సమయం కేవలం 1 గంట 32 నిమిషాలు (92 నిమిషాలు) మాత్రమే ఉంది.

పూజా సమయం: ఏప్రిల్ 19న ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:20 వరకు.

ఈ పవిత్ర సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ లేదా కనకధారా స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సాక్షాత్తు ఆ మహాలక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది.

బంగారం కొనడానికి శుభ ఘడియలు:

బంగారం కొనుగోలుకు ఈ ఏడాది ఏకంగా 19 గంటల సుదీర్ఘ సమయం అందుబాటులో ఉంది. మీ వీలును బట్టి ఈ కింది ముహూర్తాల్లో పసిడిని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఉదయం 10:49 – 12:20 వరకు అత్యంత ఉత్తమం. అలాగే మధ్యాహ్నం 01:58 గంటల నుంచి సాయంత్రం 03:35 గంటల వరకు శుభ ఘడియలు, అలాగే సాయంత్రం 06:49 గంటల నుంచి రాత్రి 10:57 గంటలకు సాయంకాల ముహూర్తం బాగుందని, అలాగే తెల్లవారుజామున (ఏప్రిల్ 20) 04:28 గంటల నుంచి ఉదయం 05:51 బ్రహ్మ ముహూర్త సమయాలని పండితులు చెబుతున్నారు.

అరుదైన రాజయోగాలు – అపారమైన లాభాలు

ఈసారి అక్షయ తృతీయ నాడు స్వాతి, విశాఖ నక్షత్రాలతో పాటు బ్రహ్మ, ఇంద్ర, గజకేసరి, మాలవ్య రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు ఏప్రిల్ 20న రవి యోగం కూడా తోడవుతోంది. ఈ కాలంలో బంగారం, వెండి లేదా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టే పెట్టుబడులు దీర్ఘకాలంలో అద్భుతమైన లాభాలను ఇస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

దానమే అసలైన ధనం

అక్షయ తృతీయ నాడు కేవలం కొనుగోలు మాత్రమే కాదు, దానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.

వేసవి తీవ్రత దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం.

పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం.

ముఖ్యంగా పితృదేవతల ఆశీస్సుల కోసం పానకం, విసనకర్రలు దానం చేయడం శ్రేయస్కరం. మీ ఆర్థిక ఎదుగుదలకు ఈ అక్షయ తృతీయ ఒక బలమైన పునాది అవుతుంది.ఈ శుభ ముహూర్తాల్లో మీ ఇంట మహాలక్ష్మిని ఆహ్వానించండి.

ఇది కూడా చదవండి: Akshaya Tritiya: షాకింగ్ న్యూస్.. బంగారం కొనాలా? వెండి ధర రూ.3.5 లక్షలు..?

ఇది కూడా చదవండి: Vastu Plants for Wealth: మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరియాలా? అయితే ఈ మొక్కలు తప్పనిసరి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us