Airtel: మీరు ఎయిర్‌టెల్‌ సిమ్‌ను ఉపయోగిస్తున్నారా.? అయితే రూ. 8 లక్షలు లోన్‌ పొందే అవకాశం, ఎలాగంటే..

|

Jan 03, 2023 | 2:29 PM

ప్రముఖ టెలికాం నెట్‌వర్క్‌ సంస్థ ఎయిర్‌టెల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఎయిర్‌ థ్యాంక్స్‌ యాప్‌ పేరుతో యూపీఐతో పాటు బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఎయిర్‌టెల్ తమ యూజర్ల..

Airtel: మీరు ఎయిర్‌టెల్‌ సిమ్‌ను ఉపయోగిస్తున్నారా.? అయితే రూ. 8 లక్షలు లోన్‌ పొందే అవకాశం, ఎలాగంటే..
Airtel Personal Loan
Follow us on

ప్రముఖ టెలికాం నెట్‌వర్క్‌ సంస్థ ఎయిర్‌టెల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఎయిర్‌ థ్యాంక్స్‌ యాప్‌ పేరుతో యూపీఐతో పాటు బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఎయిర్‌టెల్ తమ యూజర్ల కోసం బంపరాఫర్‌ను ప్రకటించింది. ఎయిర్‌టెల్ సిమ్‌ను ఉపయోగిస్తున్న వారికి ఏకంగా రూ. 8 లక్షల వరకు రుణం పొందో అవకాశాన్ని కల్పిస్తోంది. ఎలాంటి పేపర్‌ వర్క్‌ లేకుండా సులభంగా లోన్‌ అందిస్తోంది.

లోన్‌ తీసుకోవాలనుకునే వారు తమ స్మార్ట్‌ ఫోన్స్‌లో ఎయిర్‌టెల్ థాంక్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం యాప్‌ ఓపెన్‌ చేసి పర్సనల్‌లోన్‌ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అనంతరం అక్కడ లోన్స్‌ అందిస్తోన్న కొన్ని బ్యాంక్‌ల వివరాలు కనిపిస్తాయి. మనీ వ్యూ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ వంటి బ్యాంకుల పేర్లు కనిపిస్తాయి. అందులో నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకొని లోన్‌ ప్రాసెస్‌ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఎయిర్‌టెల్‌ నేరుగా లోన్‌ ఇవ్వదు కానీ మిడియేటర్‌గా మాత్రమే వ్యవహరిస్తుంది.

యాప్‌లో తీసుకోవాలనుకునే వారు కచ్చితంగా ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు కలిగి ఉండాలి. వీటితో పాటు యూజర్లు నిర్ణీత క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండాలి. అర్హతల ప్రాతిపదికన యూజర్లు రూ. 10 వేల నుంచి రూ. 8 లక్షల వరకు లోన్‌ను పొందొచ్చు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే లోన్‌ అప్లై చేసుకునున్న తర్వాత 24 గంటల్లో అమౌంట్‌ అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతుంది. లోన్‌ తీసుకున్న తర్వాత ప్రతి నెలా బ్యాంక్‌ నుంచి ఈఎంఐ కట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..