UPI Credit Card: రూపే క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ సేవలు.. యాక్టివేట్ చేసుకోండిలా..
ప్రస్తుతం యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయడానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక కార్డులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం, వినియోగదారులు తమ రూపే క్రెడిట్ కార్డ్‌లను యూపీఐ బీమ్, మొబిక్విక్, పేటీఎం యాప్‌ల ద్వారా లింక్ చేయవచ్చు.

భారతదేశంలో 2016లో చేసిన నోట్ల రద్దు ప్రారంభించిన యూపీఐ సేవలు గణీనీయంగా పెరగుతున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఆన్‌లైన్ పేమెంట్స్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తాజాగా ఆర్‌బీఐ రెండు వేల రూపాయల నోటు కూడా వెనక్కి తీసుకుంది. అలాగే ఎన్‌పీసీఐ రూపొందించిన యూపీఐ సేవలను మరింత విస్తరించే క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ సేవలను ప్రారంభించారు. అయితే ఈ సేవలు ప్రస్తుతం రూపే క్రెడిట్ కార్డులకు మాత్రమే ఉంది. రూపే క్రెడిట్ కార్డులు కస్టమర్‌లకు క్రెడిట్ కార్డ్ జీవితచక్రం అంతటా డిజిటల్‌గా ఇంటిగ్రేటెడ్ అనుభవాన్ని అందిస్తాయి. వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్‌ల పెరిగిన సౌలభ్యాన్ని ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం రూపే క్రెడిట్ కార్డులను నేరుగా యూపీఐకు లింక్ చేసి చెల్లింపులు చేయవచ్చు. ఇది సురక్షితమైన చెల్లింపు లావాదేవీలను నిర్ధారిస్తుంది. ప్రస్తుతం యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయడానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక కార్డులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం, వినియోగదారులు తమ రూపే క్రెడిట్ కార్డ్‌లను యూపీఐ బీమ్, మొబిక్విక్, పేటీఎం యాప్‌ల ద్వారా లింక్ చేయవచ్చు. యూపీఐ క్రెడిట్ కార్డ్ లింక్‌ను ప్రారంభించడానికి ఇతర అప్లికేషన్‌లు కూడా తమ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నాయి.
మీ క్రెడిట్ కార్డ్‌ను యూపీఐకు లింక్ చేయండిలా
- మొదటగా ప్లేస్టోర్ నుంచి బీమ్, ఫోన్ పే, పేటీఎం, మొబిక్విక్ వంటి యూపీఐ యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకుని నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి.
- డ్రాప్-డౌన్ జాబితా నుండి మీ బ్యాంక్‌ని ఎంచుకోవాలి.
- మీ మొబైల్ నంబర్‌తో అనుసంధానమైన క్రెడిట్ కార్డ్‌ల జాబితా నుంచి మీరు లింక్ చేయాలనుకుంటున్న రూపే క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకుని యూపీఐ పిన్ నమోదు చేసుకోవాలి.
- ప్రస్తుతం యూపీఐలో రూపే క్రెడిట్ కార్డ్‌లను మాత్రమే లింక్ చేయవచ్చు. వీసా లేదా మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డులు లింక్ అవ్వవు.
- మీ రూపే క్రెడిట్ కార్డ్‌లో యూపీఐని యాక్టివేట్ చేయండిలా
- యూపీఐ యాప్‌లో “క్రెడిట్ కార్డ్‌ని జోడించు” ఎంపిక క్రింద క్రెడిట్ కార్డ్ జారీచేసే బ్యాంకును కనుగొనండి.
- అక్కడ సూచనలను అనుసరించి యూపీఐ యాప్‌లో కార్డ్‌ని లింక్ చేయండి.
- యూపీఐ యాప్‌లో మార్గదర్శకంగా మీ క్రెడిట్ కార్డ్ వివరాలను ఉపయోగించి లింక్ చేసిన క్రెడిట్ కార్డ్ కోసం యూపీఐ పిన్‌ని సెటప్ చేయండి.
- ఒకసారి లింక్ చేసి, పిన్ సెట్ చేసిన తర్వాత, మీరు చెల్లింపుల కోసం రూపే క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు.
- మీరు అన్ని యూపీఐ వ్యాపారుల వద్ద లావాదేవీల కోసం మీ యూపీఐ లింక్ చేసిన క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం