AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: 2023లో భారత బిలినియర్లుగా నిలిచింది హైదరాబాదీలే.. లిస్ట్‌లో ఎవరున్నారంటే..

భారతదేశంలోని అగ్రభాగంలో నిలిచిన 100 మంది సంపన్న వ్యక్తులలో నలుగురు హైదరాబాద్ వాసులు ఉన్నారు. మన దేశంలో బిలియనీర్ల సంఖ్య అధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఏడవ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం, భారతదేశంలో అత్యధిక బిలియనీర్లు అంటే ప్రతి 100 మందిలో 33 మంది బిలియనీర్లు ముంబైలో ఉన్నట్లు వెల్లడించింది.

Hyderabad: 2023లో భారత బిలినియర్లుగా నిలిచింది హైదరాబాదీలే.. లిస్ట్‌లో ఎవరున్నారంటే..
According To The Forbes India Rich List 2023, 4 Billionaires From Hyderabad
Srikar T
|

Updated on: Nov 14, 2023 | 11:00 AM

Share

భారతదేశంలోని అగ్రభాగంలో నిలిచిన 100 మంది సంపన్న వ్యక్తులలో నలుగురు హైదరాబాద్ వాసులు ఉన్నారు. మన దేశంలో బిలియనీర్ల సంఖ్య అధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఏడవ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం, భారతదేశంలో అత్యధిక బిలియనీర్లు అంటే ప్రతి 100 మందిలో 33 మంది బిలియనీర్లు ముంబైలో ఉన్నట్లు వెల్లడించింది. మన దేశంలోని అదే 100 మంది ధనవంతులలో నలుగురు బిలియనీర్లు హైదరాబాద్‌లో ఉండటం గమనార్హం. ఇందులో ముఖ్యంగా మురళి దీవి కుటుంబం, పిపి రెడ్డి తోపాటూ పివి కృష్ణా రెడ్డి రెడ్డి కుటుంబం, పీవీ రాంప్రసాద్ రెడ్డి వీరి పేర్లు వినిపిస్తున్నాయి. వీరు ఏ రంగాల్లో రాణిస్తున్నారో ఇప్పుడు చూద్దాం.

మురళీ కృష్ణ దివి రూ. 2,597కోట్లతో టర్నోవర్ కలిగిన ఔషధ తయారీ కంపెనీని కలిగి ఉన్నారు. ఈ పరిశ్రమకు అధిక డిమాండ్ ఉన్న కారణంగా గత ఏడాది దివీస్ లేబొరేటరీస్ స్టాక్ ధర 75 శాతం పెరిగింది. పెద్ద ఔషధ తయారీదారులకు ముడిపదార్థాలను సరఫరా చేయడంలో క్రియాశీల పాత్ర పోషిస్తోం. దివిస్ ల్యాబ్స్ అనేది ఆస్టియో ఆర్థరైటిస్ చికిత్సకు ఉపయోగించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులలో భాగమైన నాప్రోక్సెన్‌ను తయారు చేస్తుంది. ఇది ప్రపంచంలోనే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే సంస్థగా నిలిచింది. ఈ రోజు కంపెనీ ఇంత పటిష్టంగా ఉండటానికి ప్రధాన కారణం ఉద్దేశ్యపూర్వకంగానే ఫార్మారంగంలో అడుగు పెట్టడం అని తెలిసింది. మురళీ దివి ఒక వ్యాపారవేత్తగా ఎదగడానికి 1984లో అమెరికన్ సంస్థలో సీనియర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో పనిచేయడమేనని చెప్పారు. మురళీ దివి 1990లో భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు తన కొత్త వెంచర్ దివీస్ లేబొరేటరీస్‌ను ప్రారంభించాడు. 1995 లో 71 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే తయారీ కేంద్రంగా దీనిని హైదరాబాద్‌లో నిర్మించారు.

ఇక బిలినియర్ల జాబితాలో నిర్మాణ ద్వయం పివి కృష్ణా రెడ్డి ఉన్నారు. వీరి నికర విలువ 4.05 బిలియన్ డాలర్లుగా గుర్తించారు. వీరికి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (MEIL) పేరుతో పెద్ద సంస్థ ఉంది. ఇది డ్యామ్‌లు, రోడ్ల నిర్మాణానికి ప్రసిద్ధి. దీని అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ Olectra Greentech ద్వారా భారతదేశంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో అగ్రగామిగా నిలిచింది. ఈ మధ్య కాలంలో తిరుమలకు కొన్ని బస్సులను ఉచితంగా అందించారు. చైనీస్ ఆటోమేకర్ BYD భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగంలోకి ప్రవేశించారు. ఒలెక్ట్రా Olectra ఇటీవల పెద్దఎత్తున వార్తల్లో నిలిచింది. తెలంగాణలో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని, భారతదేశం అంతటా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న వారి ప్రతిపాదనను న్యూఢిల్లీ తిరస్కరించినట్లు తెలిసింది. ఇంతలో ఒలెక్ట్రా Olectra ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చి తన అమ్మకాలలో సరికొత్త జోష్ చూపించింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 563 బస్సులను విక్రయించినట్లు తెలుస్తోంది. ఎక్కువగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రజా రవాణా సేవలకు వినియోగిస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ వంటి దిగ్గజ సంస్థలతో పోటీపడి Olectra సంస్థ ధీటుగా నిలిచింది. 3,239 బస్సులు అడ్వాన్స్‌గా ఆర్డర్ బుక్ అయినట్లు వెల్లడించారు. ఫిబ్రవరిలో, బిలియనీర్ ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో భాగస్వామ్యంతో హైడ్రోజన్-ఆధారిత బస్సు నమూనాను రూపొందించినట్లు ఒలెక్ట్రా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ఇక రెడ్డీస్ కుటుంబం కూడా బిలినియర్ జాబితాలో చోటు దక్కించుకుంది. దీని నికర విలువ 3 బిలియన్ డాలర్లుగా ఉంది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌ ఔషధాలకు అవసరమైన జనరిక్‌లను తయారు చేయడానికి దోహదపడుతుంది. దీనిని పసుపు రైతు కుమారుడు దివంగత కె అంజి రెడ్డి 1984లో ఫార్మా సంస్థను స్థాపించారు. ఈ కంపెనీని ప్రస్తుతం అతని కుమారుడు సతీష్ రెడ్డితోపాటూ అతని అల్లుడు జివి ప్రసాద్ నడుపుతున్నారు. ఉత్తర అమెరికా కంటే కూడా భారతదేశం ద్వారా మూడవ వంతు ఆదాయాన్ని గణిస్తున్నారు. 2023 ఏప్రిల్‌లో ఈ కంపెనీ తన రీహైడ్రేటింగ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ Rebalanz Vitorsకి బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు మరియు ఫిట్‌నెస్ ఔత్సాహికుడు సోనూ సూద్‌‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ ఎనర్జిటిక్ డ్రింక్‌తో న్యూట్రిషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టాలని భావిస్తున్నారు.

ఇక పీవీ రాంప్రసాద్ రెడ్డి అనగానే అరబిందో ఫార్మా సంస్థ గుర్తుకు వస్తుంది. ఈయన నికర ఆదాయం విలువ 2.6 బిలియన్ డాలర్లు ఉన్నట్లు ప్రకటించారు. పీవీ రాంప్రసాద్ రెడ్డి 1986లో కో పార్ట్నర్‌గా పెట్టుబడులు పెట్టి అరబిందో ఫార్మా బోర్డులో సభ్యుడిగా కూర్చున్నారు. అరబిందో ఫార్మా మధుమేహంతో పాటూ గుండె జబ్బులు అనేక వ్యాధుల చికిత్సకు మందులను తయారు చేస్తుంది. కంపెనీ దాని వార్షిక ఆదాయంలో దాదాపు మూడు వంతులు అమెరికా, యూరప్ నుండి పొందుతుంది. ఇది పాండిచ్చేరిలో ఒకే తయారీ ప్లాంట్‌‌ను నిర్మించి ఔషధ ఉత్పత్తులను ప్రారంభించింది. సెప్టెంబరు 2023లో, అరబిందో ఫార్మా భారతదేశంలో క్యాన్సర్ మందు రెవ్లిమిడ్‌ను ఉత్పత్తి చేయడానికి అనుమతులను పొందింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..