Business Ideas: ఈ ఐడియాలతో.. ఆన్‌లైన్‌లో వ్యాపారం, భారీగా లాభం..

ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసుకునే అవకాశం వచ్చేసింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు పలు ఈ కామర్స్‌ సంస్థలు కస్టమర్లు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించుకునే వెసులుబాటును కల్పించాయి. ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చే మొత్తంలో అటు ఈ కామర్స్‌ సంస్థలకు, ఇటు ఉత్పత్తిదారులకు వాటా అందించే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో చాలా మంది ఇంట్లో ఉంటూనే..

Business Ideas: ఈ ఐడియాలతో.. ఆన్‌లైన్‌లో వ్యాపారం, భారీగా లాభం..
Business Ideas
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 14, 2023 | 11:53 AM

టెక్నాలజీలో వచ్చిన మార్పు కారణంగా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. విద్య, వ్యాపారం ఇలా అన్ని ప్రధాన రంగాలు టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ ఇంట్లో కూర్చునే వ్యాపారం చేసుకోవచ్చు. ఈ కామర్స్‌ రంగంతో వ్యాపారంలో సమూల మార్పులు వచ్చాయి.

ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసుకునే అవకాశం వచ్చేసింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు పలు ఈ కామర్స్‌ సంస్థలు కస్టమర్లు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించుకునే వెసులుబాటును కల్పించాయి. ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చే మొత్తంలో అటు ఈ కామర్స్‌ సంస్థలకు, ఇటు ఉత్పత్తిదారులకు వాటా అందించే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో చాలా మంది ఇంట్లో ఉంటూనే ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసుకుంటున్నారు. ఇలా ఆన్‌లైన్‌లో చేసే కొన్ని బెస్ట్ బిజినెస్‌ ప్లాన్స్‌పై ఓ లుక్కేయండి..

* ఈ కామర్స్‌ సైట్స్‌లో దుస్తులను విక్రయించడం బెస్ట్‌ బిజినెస్‌ ప్లాన్స్‌లో ఒకటిగా చెప్పొచ్చు. సాధారణంగా రిటైల్‌ దుకాణాన్ని ప్రారంభించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం ఉంటుంది. అయితే ఆన్‌లైన్‌లో ఈ కామర్స్‌ సైట్స్‌కు టై అప్‌ కావడం లేదా మీరే స్వయంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించుకొని దుస్తులను అమ్ముకోవచ్చు. హోల్‌సేల్‌గా దుస్తులను బయట కొనుగోలు చేసి వాటిని ఎక్కువ ధరకు విక్రయించుకోవచ్చు. వాట్సాప్‌ గ్రూప్స్‌లలో కూడా మీ దుస్తులను ప్రమోట్‌ చేసుకొని విక్రయించుకోవచ్చు.

* ఇక గృహాలంకరణ వస్తువులకు కూడా ఆన్‌లైన్‌లో డిమాండ్‌ పెరుగుతోంది. పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండానే ఈ వ్యాపారాన్ని ప్రారంభింవచ్చు. మీరు సొంతంగా వస్తువులను తయారు చేయడమే కాకుండా హోల్‌ సేల్‌గా కొనుగోలు చేసి కూడా అమ్ముకోవచ్చు. దీంతో మంచి లాభాలను పొందొచ్చు.

* ఇటీవల బ్యూటీ ప్రొడక్ట్స్‌కు ఆదరణ పెరుగుతోంది. చాలా మంది బ్యూటీ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఈ కామర్స్‌ సైట్స్‌ ద్వారా ఇలాంటి ఉత్పత్తులను విక్రయించడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు. అలాగే మీ ప్రొడక్ట్స్‌ను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా సైట్స్‌ ద్వారా కూడా ప్రమోట్ చేసుకోవచ్చు.

* ఈ కామర్స్‌ సైట్స్‌లో బొమ్మలను కూడా విక్రయించుకోవచ్చు. ఇందుకోసం మీరు ముందుగా కొంత పెట్టుబడి పెట్టి బొమ్మలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో ఓ గది లేదా, గోడాన్‌ను తీసుకొని బొమ్మలను స్టోర్ చేయాలి. ఆ తర్వాత బొమ్మలను ఆన్‌లైన్‌లో విక్రయించడం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు.

* ఈ కామర్స్‌ సైట్స్‌లో ప్రింటెండ్‌ దుస్తులకు గిరాకీ బాగా పెరుగుతోంది. కస్టమైజ్డ్‌ ప్రింటెడ్‌ దుస్తులు, వస్తువులను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. సెలబ్రిటీలు, దేవుళ్ల ఫొటోలను కీచైన్స్‌, మగ్స్‌, టీషర్ట్స్‌, మొబైల్‌ కవర్స్‌పై ప్రింట్ చేయించి వాటిని కూడా ఆన్‌లైన్‌లో విక్రయించుకోవచ్చు. పైన తెలిపినవన్నీ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ విక్రయించుకునే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..