AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఇళ్లల్లో అద్దెకు ఉన్నవాళ్లు అనుమానస్పదంగా కనిపిస్తున్నారా? వారి వద్ద ఉన్న ఆధార్‌ నిజమైనదా? కదా.. ఇలా తెలుసుకోండి!

అన్ని డాక్యుమెంట్లలో ఆధార్‌ కార్డు ముఖ్యమైనదిగా మారిపోయింది. అయితే ఆధార్‌ వల్ల కూడా కొన్ని మోసాలు జరుగుతున్నాయి. నకిలీ ఆధార్‌ సృష్టించడం, దుర్వినియోగం కావడం వంటివి..

Aadhaar Card: ఇళ్లల్లో అద్దెకు ఉన్నవాళ్లు అనుమానస్పదంగా కనిపిస్తున్నారా? వారి వద్ద ఉన్న ఆధార్‌ నిజమైనదా? కదా.. ఇలా తెలుసుకోండి!
Aadhaar Card
Subhash Goud
|

Updated on: Nov 01, 2022 | 5:30 AM

Share

అన్ని డాక్యుమెంట్లలో ఆధార్‌ కార్డు ముఖ్యమైనదిగా మారిపోయింది. అయితే ఆధార్‌ వల్ల కూడా కొన్ని మోసాలు జరుగుతున్నాయి. నకిలీ ఆధార్‌ సృష్టించడం, దుర్వినియోగం కావడం వంటివి అప్పుడప్పుడు జరుగుతుండటం చూస్తుంటాము. కొందరు మోసం చేసేందుకు నకిలీ ఆధార్‌ కార్డులను కూడా సృష్టిస్తు్న్నారు. ఇక పలు ప్రాంతాల్లో కొందరు అనుమానస్పద వ్యక్తులు అద్దెకు దిగుతున్నారు. వారు ఏం పనులు చేస్తారో.. ఎవ్వరికి తెలియదు. మోసగాళ్లు, దొంగలు ఇలా రకరకాల వ్యక్తులు అద్దె ఇళ్లలో ఉంటూ వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను వారు ఎలాంటి వారే గుర్తించడం మంచిదని కేంద్ర ప్రభుత్వం. అయితే అలాంటి అనుమానాస్పద వ్యక్తులు నకిలీ ఆధార్‌ కార్డులు సృష్టించి అద్దె ఇళ్లల్లో ఉంటూ వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. అద్దెకు ఉంటున్నవారి ఆధార్‌ కార్డును పరిశీలించి వారి ఆధార్‌ నకిలీదా..? నిజమైనదా ..? అని గుర్తించడం ఎంతో ముఖ్యం.

ఆధార్ నకిలీదా ..లేదా? ఇలా చెక్ చేయండి

ఇటీవల కాలంలో UADAI తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆధార్ మోసం గురించి ప్రజలను హెచ్చరించింది. ఆధార్ పేరిట మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏజెన్సీ తెలిపింది. మీ ఆధార్ నిజమైనదా, నకిలీదా అని మీరు ఎలా తనిఖీ చేయవచ్చో ట్విట్టర్ ద్వారా తెలిపింది. పూర్తిగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డును ధృవీకరించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాల్లో మీరు ఆధార్‌కు సంబంధించిన ఏ సమస్యకైనా పరిష్కారం పొందవచ్చు. ఆధార్ ఆఫ్‌లైన్‌లో తనిఖీ చేయడానికి దాని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని యుఐడిఎఐ తెలిపింది. ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడానికి లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వత సెక్యూరిటీ కోడ్‌, క్చాప్చార్‌ ఎంటర్‌ చేసిన తర్వాత వెరిఫై కోసం ప్రోసీడ్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత ఆధార్‌ వివరాల స్థితి తెలిసిపోతుంది. ఆ ఆధార్‌ నంబర్‌ నిజమైనదా..? కదా అనే విషయం తెలిసిపోతుంది. అలాగే ఈ పనిని m-Aadhaar యాప్ ద్వారా కూడా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల వారు ఎలాంటి వారో అనే విషయాన్ని ముందస్తుగా నిర్ధారించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్