Toyota Cars: టయోటా కార్ల ప్రియులకు షాక్.. ఆ మోడల్ కార్లపై ధరల పెంపు
భారతదేశంలో టయోటా కార్లకు క్రేజ్ ఎక్కువ. అందుబాటు ధరల్లో సూపర్ ఫీచర్లతో వచ్చే ఈ కార్లు భారతీయులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో టయోటా కార్ల లవర్స్‌కు ఆ కంపెనీ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. భారతదేశంలో తన మోడల్ శ్రేణి ధరలను ఏప్రిల్ 1, 2024 నుంచి పెంచామని ప్రకటించింది.
భారతదేశంలో కార్ల వినియోగం క్రమేపి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ కార్లను రిలీజ్ చేస్తూ భారతీయ కార్ల అభిమానుల మనస్సును దోచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంత కారును కొనాలనుకునే వారు తమ దగ్గర ఉన్న పొదుపు సొమ్ముతో పాటు ఈఎంఐ తీసుకుని మరీ కార్లను కొనుగోలు చేస్తున్నారు. భారతదేశంలో టయోటా కార్లకు క్రేజ్ ఎక్కువ. అందుబాటు ధరల్లో సూపర్ ఫీచర్లతో వచ్చే ఈ కార్లు భారతీయులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో టయోటా కార్ల లవర్స్‌కు ఆ కంపెనీ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. భారతదేశంలో తన మోడల్ శ్రేణి ధరలను ఏప్రిల్ 1, 2024 నుంచి పెంచామని ప్రకటించింది. భారతదేశంలో పెరిగిన ఇన్పుట్ ఖర్చులు మరియు కార్యకలాపాల వ్యయాన్ని పేర్కొంటూ కంపెనీ సుమారు 1 శాతం ధర పెంపును ప్రకటించింది. ఈ నేపథ్యంలో టయోటా కార్ల ధరల పెంపు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
టయోటా కంపెనీ ప్రకారం ఈ ధరల పెంపు దేశంలోని నిర్దిష్ట మోడళ్ల ఎంపిక ట్రిమ్ స్థాయిలకు వర్తిస్తుంది. గ్లాన్జా, రూమియన్, అర్బన్ క్రూయిజర్ హైర్డర్, ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిప్టా, హిలక్స్, క్యామ్రీ, ఫార్చ్యూనర్, లెజెండర్ వంటి భారతీయ మార్కెట్లో కంపెనీ అందిస్తున్న చాలా కార్లపై ఈ ధరల పెంపు ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ల్యాండ్ క్రూయిజర్ 300 సిరీస్‌తో పాటు వెల్ఫైర్‌లపై ఈ ధరల పెంపు వల్ల ప్రభావితం ఉండదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల టయోటా కంపెనీ ధరల పెంపును హైలైట్ చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. “టయోటా కిర్లోస్కర్ మోటార్ ఏప్రిల్ 01, 2024 నుంచి దాని నిర్దిష్ట మోడల్స్‌కు సంబంధించిన కొన్ని గ్రేడ్ల ధరలను పెంచాలని కంపెనీ యోచిస్తోందని ప్రకటించింది. ఊహించిన 1 శాతం పెరుగుదలతో, ఇన్పుట్ ఖర్చులు, కార్యాచరణ వ్యయాలు పెరగడం వల్ల ఈ చర్య తీసుకున్నామని వివరించింది.
భారతదేశంలో ఇన్‌పుట్ ధర పెరుగుదల కారణంగా ఈ సంవత్సరం ధరల పెంపును ప్రకటించిన మొదటి తయారీదారు టయోటా కాదు. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, ఆడి, హ్యుందాయ్, ఎమ్ఐ మోటార్, మహీంద్రా, సిట్రోయెన్, బిఎమ్ఐడబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, విడబ్ల్యూ, స్కోడా, సిట్రోయెన్ వంటి కార్ల తయారీ కంపెనీలు భారత మార్కెట్లో తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. ఏప్రిల్ 2024 నుంచి హోండా, కియా కూడా భారతదేశంలో తమ కార్ల ధరలను పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి