AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola EV Company: ఓలాకు మతిపోయే షాక్.. సర్వీసు ఇబ్బందులపై విచారణకు ఆదేశం

భారతదేశంలో ఈవీ స్కూటర్ల వినియోగాన్ని ప్రజలు అధికంగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా దేశంలో ఓలా కంపెనీ స్కూటర్లు సేల్స్ పరంగా దూసుకుపోయాయి. అయితే ఇదే ఓలా కంపెనీపై ఇప్పుడు యూజర్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా సర్వీసు లోపాలపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓలా కంపెనీపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Ola EV Company: ఓలాకు మతిపోయే షాక్.. సర్వీసు ఇబ్బందులపై విచారణకు ఆదేశం
Ola
Nikhil
|

Updated on: Nov 15, 2024 | 4:15 PM

Share

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఓలా ఎలక్ట్రిక్ సేవా ప్రమాణాలతో పాటు ఉత్పత్తిలో నాణ్యత లోపాలపై దర్యాప్తు చేయనుందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) సాఫ్ట్‌బ్యాంక్ మద్దతు ఉన్న ఈ-స్కూటర్ తయారీదారుకి అధిక ఫిర్యాదుల తర్వాత నోటీసు జారీ చేసిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. అక్టోబర్‌లో కస్టమర్ల నుంచి దాదాపు 10,000 ఫిర్యాదులు ఎందుకు వచ్చాయో వివరించాలని సీసీపీఏ ఓలా ఎలక్ట్రిక్‌ని కోరింది. అయితే ఓలా కంపెనీ మాత్రం ఆ ఫిర్యాదుల్లో 99.1 శాతం ఫిర్యాదులను పరిష్కరించామని సమాధానం ఇచ్చింది. 

కంపెనీ ప్రతిస్పందనను సమీక్షించిన తర్వాత సీసీపీఏ ఈ విషయంపై వివరణాత్మక దర్యాప్తును నిర్వహించే బాధ్యతను బీఐఎస్‌కు అప్పగించింది.  ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఫిర్యాదులు చాలా ఇటీవల చాలా సింపుల్‌గా స్పందించారని వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఫిర్యాదుల్లో మూడింట రెండు వంతులు వదులుగా ఉండే పార్ట్స్ లేదా ఉపయోగించిన సాఫ్ట్‌వేర్ గురించి తెలియని కస్టమర్‌లు వల్ల వచ్చిన చిన్న సమస్యలు మాత్రమేనని పేర్కొన్నారు. 

ఫిర్యాదుల సంఖ్య పెరగడం ఓలా ఎలక్ట్రిక్‌పై నియంత్రణ పరిశీలనకు దారితీసింది. ఓలాపై ఫిర్యాదుల నేపథ్యంలో ఆగస్టులో ఓలా స్టాక్ మార్కెట్ అరంగేట్రంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ కంపెనీ షేర్లు వాటి ప్రారంభ లిస్టింగ్ ధర రూ.76 నుండి దాదాపు 7.6% క్షీణించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)లో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 1 శాతానికి పైగా తగ్గి రూ.70.11 వద్ద ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి