SBI Interest Rates : ఎస్‌బీఐ రుణగ్రహీతలకు పండగే.. తగ్గిపోనున్న ఈఎంఐలు
మీరు స్టేట్ బ్యాంకు నుంచి హౌసింగ్ రుణం తీసుకున్నారా, ప్రతి నెలా దానికి ఈఎంఐ చెల్లిస్తున్నారా, అయితే మీకు ఇది మంచి శుభవార్త. ఈ నెల నుంచి వీరు కట్టే నెలవారీ వాయిదా తగ్గుతుంది. లేదా రుణ కాలపరిమితికి తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ బ్యాంకు ఎక్స్ టర్నల్ బెంచ్ మార్కు ఆధారిత లెండింగ్ రేట్లు (ఈబీఎల్ఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)లను 25 బేస్ పాయింట్లకు తగ్గించింది. దీంతో ఈఎంఐ వాయిదా మొత్తం కూడా తగ్గుతుంది. ఫిబ్రవరి 15 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇంఢియా (ఆర్బీఐ) రెపో రేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది. దీంతో బ్యాంకుల నుంచి తీసుకున్న హౌసింగ్, వ్యక్తిగత రుణాలు మరింత అనుకూలంగా మారాయి. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా స్టేట్ బ్యాంకు తన ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ రేట్లను తగ్గించింది. అయితే బ్యాంకు మార్జినల్ కాస్ట్ బెస్ట్ లెండింగ్ రేట్లు (ఎంసీఎల్ఆర్), బేస్ రేటు, బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్) రేట్లు మార్చలేదు. ఆర్బీఐ రెపోరేటును తగ్గించడంతో 20 ఏళ్ల రుణ వ్యవధిలో ఈఎంఐలు 1.8 శాతం తగ్గుతాయి. దీని వల్ల రుణ గ్రహీతలను ఉపశమనం కలుగుతుంది. హౌసింగ్ రుణాలను రెపోరేటును అనుసంధానం చేసేందుకు ఈబీఎల్ఆర్ విధానాన్ని 2019 అక్టోబర్ 1 నుంచి స్టేట్ బ్యాంకు అనుసరిస్తోంది.
ఆర్బీఐ రెపోరేటు మారినప్పుడల్లా ఈ రేటు మారుతూ ఉంటుంది. తాజాగా ఈబీఎల్ఆర్ ను 9.15 శాతం నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో అది 8.90 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో ఈబీఎల్ఆర్ తో అనుసంధానమైన హౌసింగ్ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. అలాగే ఆర్ బీఐ రెపోరేటుకు అనుసంధానమైన ఆర్ఎల్ఎల్ఆర్ ను కూడా 25 బేసిస్ పాయింట్లకు ఎస్బీఐ తగ్గించి, 8.50 శాాతానికి తీసుకువచ్చింది. ఈ విధానంలో మంజూరు చేసిన హౌసింగ్, బిజినెస్ రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనం కలుగుతుంది.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో రుణాలు తీసుకున్న ఖాతాదారులకు ఉపశమనం కలుగుతుంది. ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ తో అనుసంధానించిన ఫ్లోటింగ్ – రేట్ రుణాల వడ్డీ రేట్లు తగ్గుతాయి. దాని వల్ల ఈఎంఐ మొత్తం తక్కువవుతుంది. లేకపోతే రుణ వాయిదాల కాలపరిమితిని తగ్గిస్తారు. ఆర్బీఐ రెపోరేటు తగ్గింపు తర్వాత రుణాల వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టనున్నందును రుణగ్రహీతలు తమ రుణ ఒప్పందాలను సమీక్షించుకోవాలి. అవసరమైతే రీఫైనాన్స్ ఎంపికలను పరిశీలించాలి. రెపోరేటు కదలికలు, బాహ్య బెంచ్ మార్కులను ట్రాక్ చేయడం వల్ల చక్కని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి