AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Scam: ఒక్క ఫేక్ కాల్‌తో రూ.9 లక్షల హాంఫట్.. వెలుగులోకి నయా క్రెడిట్ కార్డు స్కామ్

బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా సరికొత్త సేవలు ఖాతాదారులకు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో బ్యాంకులు తమ ఖాతాదారులకు విరివిగా క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. అయితే అవసరానికి ఉపయోగపడతాయని తీసుకునే క్రెడిట్ కార్డుల కారణంగా ఓ వ్యక్తి రూ.9 లక్షలు నష్టపోయాడు. ఒకే ఒక్క కాల్‌తో దుండగులు రూ.9 లక్షలు కాజేశారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ క్రెడిట్ కార్డు స్కామ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Credit Card Scam: ఒక్క ఫేక్ కాల్‌తో రూ.9 లక్షల హాంఫట్.. వెలుగులోకి నయా క్రెడిట్ కార్డు స్కామ్
Credit Card
Nikhil
|

Updated on: Mar 22, 2025 | 4:00 PM

Share

ఇటీవల దేశంలో వెలుగులోకి వచ్చిన ఓ క్రెడిట్ కార్డు స్కామ్‌పై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడైన రాజేష్ కుమార్ క్రెడిట్ కార్డుల నుంచి దఫదఫాలుగా రూ.8.69 లక్షలను దుండగులు దోచేశారు. రాజేష్ కుమార్‌కు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగినని చెబుతూ ఇటీవ ఓ కాల్ వచ్చింది. ఆ స్కామర్ రాజేష్‌ను వాట్సాప్ వీడియో కాల్ చేయమనడంతో రాజేష్ ఆ విధంగా చేశాడు. అయితే గుర్తింపు ధ్రువీకరణ కోసమంటూ  ఆ సమయంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులతో సహా అతని మొత్తం క్రెడిట్ కార్డులను చూపమని కోరారు. 

రాజేష్‌ అలా చేశాక అతని ఫోన్‌కు దరఖాస్తు ఫారం రూపంలో మోసపూరిత లింక్ వచ్చింది. ఆ లింక్ పై క్లిక్ చేయడం వల్ల అతని క్రెడిట్ కార్డులపై అనధికార లావాదేవీలు జరిగాయి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డుపై మొత్తం రూ.8,69,400 విలువైన ఆరు మోసపూరిత ఆరోపణలు చేశాడు. అతని యాక్సిస్ బ్యాంకు కార్డు నుంచి రూ.60,000 విత్‌డ్రా చేసుకున్నాడు .వెంటనే తేరుకున్న రాజేష్ ఆ కార్డులను బ్లాక్ చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. దీంతో బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. 

క్రెడిట్ కార్డ్ స్కామ్‌ల నుంచి రక్షణ ఇలా

కార్డు సమాచారం 

క్రెడిట్ కార్డు వినియోగదారులు తమ కార్డు కార్డ్ సమాచారాన్ని ఎప్పుడూ ఎవరితోనూ చెప్పకూడదు. విశ్వసనీయ బ్యాంకింగ్ సంస్థలు పిన్, ఓటీపీతో పాటు నంబర్, సీవీవీతో సహా కార్డు సంబంధిత డేటాను కోరువనే విషయాన్ని గుర్తించాలి. ఫోన్ కాల్స్, ఈ-మెయిల్‌లు, వాట్సాప్ సందేశాలు వంటి వాటి ద్వారా బ్యాంకు అధికారులమంటూ వచ్చే ఫోన్స్‌ను ఆన్సర్ చేయకపోవడం మంచిది. 

ఇవి కూడా చదవండి

మోసపూరిత లింక్‌లు

మీ మొబైల్‌కు ఏవైనా లింక్స్ వస్తే వాటిని క్లిక్ చేసే ముందు అన్ని విషయాలను నిర్ధారించుకోవడం ఉత్తమం. వాట్సాప్, ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా వచ్చే లింక్‌లు సందేహాస్పదంగా అనిపించినప్పుడు వాటిని క్లిక్ చేయవద్దు. క్రెడిట్ కార్డుకు సంబంధించిన అఫిషియల్ వెబ్‌సైట్ ద్వారా మీకు కావాల్సిన పని చేసుకోవడం ఉత్తమం.

చెల్లింపు పద్ధతులు 

మీరు కార్డుల ద్వారా లావాదేవీ చేసేటప్పడు టూ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా చేయడం ఉత్తమం.

రిమోట్ వెరిఫికేషన్ 

వీడియో కాల్స్ సమయంలో ఎవరైనా క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయమని లేదా మీ క్రెడిట్ కార్డ్ వివరాలను ప్రదర్శించమని అభ్యర్థించినప్పుడు మీ క్రెడిట్ కార్డ్‌కు యాక్సెస్ ఇవ్వకుండా ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..