7th Pay Commission: గుడ్‌న్యూస్‌.. వచ్చే నెల నుంచి వారి జీతాలు హైక్‌..!

|

Mar 07, 2022 | 7:39 AM

7th Pay Commission: డీఏ, డీఆర్‌ పెంపు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. హోలి సందర్భంగా పెరిగిన జీతాలని అందించనుంది.

7th Pay Commission: గుడ్‌న్యూస్‌.. వచ్చే నెల నుంచి వారి జీతాలు హైక్‌..!
7th Pay Commission
Follow us on

7th Pay Commission: డీఏ, డీఆర్‌ పెంపు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. హోలి సందర్భంగా పెరిగిన జీతాలని అందించనుంది. దాదాపు దేశంలోని కోటిమంది ఈ ప్రయోజనాన్ని పొందుతారు. ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను ప్రకటిస్తే ఉద్యోగులకు జీతాలు కూడా పెరుగుతాయి. డిసెంబరులో ఎఐసిపిఐ విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను 3 శాతం పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇలా జరిగితే ఉద్యోగుల బేసిక్ వేతనం పెరుగుతుంది. కార్మిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం AICPI సంఖ్య 125.4 కి చేరుకుంది. దీంతో ఉద్యోగుల డీఏ 3 శాతం పెరుగుతుందని వివరించారు. ప్రస్తుతం ఉద్యోగులకు 31 శాతం చొప్పున డీఏ లభిస్తోంది. 3 శాతం పెంపు తర్వాత 34 శాతానికి పెరగనుంది. మీడియా సమాచారం ప్రకారం.. ప్రభుత్వం కరువు భత్యాన్ని 3 శాతం పెంచవచ్చు. ఒక ఉద్యోగి మూల వేతనం నెలకు రూ.30,000 అయితే అతని జీతం నెలకు రూ.900 పెరుగుతుంది. మరోవైపు వార్షిక ప్రాతిపదికన చూస్తే రూ.10800 పెరుగుతుంది.

అలాగే కేబినెట్ సెక్రటరీ స్థాయి అధికారుల జీతం దాదాపు 2.5 లక్షల రూపాయలు ఉంటుంది. వీరికి నెలకు రూ.7500 జీతం పెరుగుతుంది. ఈ వ్యక్తులు వార్షిక ప్రాతిపదికన పూర్తి 90,000 రూపాయల ప్రయోజనాన్ని పొందుతారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్ది రోజుల క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో కరోనా మహమ్మారి వల్ల ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ నిలిపివేసిందని, ప్రభుత్వం ఆ డబ్బుతో పేదలకు సహాయం చేసిందని వివరించింది. అంతేకాదు ప్రభుత్వ మంత్రులు, ఎంపీల జీతాల్లో కోత విధించారని సీతారామన్ తెలిపారు. కానీ కేంద్ర ఉద్యోగుల జీతంలో కోత విధించలేదన్నారు. ఇప్పుడు మొత్త డీఏతో పెరిగిన జీతాలు చెల్లిస్తామని పేర్కొన్నారు.

ఈ పథకంలో నెలకి రూ.3000 పొదుపు చేస్తే చాలు.. 15 లక్షల నిధి మీ సొంతం..!

అమ్మాయిలకు గమనిక.. వేసవిలో అందంగా కనిపించాలంటే ఈ తప్పులు చేయకండి..!

Eyesight: చిన్న వయసులోనే కళ్లు దెబ్బతినడానికి కారణం ఏంటో తెలుసా..!