AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ కార్డులు ఉంటే చాలు.. అతి తక్కువ ధరకే ఫ్లైట్‌ ఎక్కొచ్చు..

తరచుగా విమాన ప్రయాణాలు చేసేవారికి శుభవార్త.. ఫ్లైట్ టికెట్ ధరలు తగ్గించుకోవడానికి, మీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న 6 బెస్ట్ ట్రావెల్ క్రెడిట్ కార్డుల గురించి తెలుసుకోండి. ఈ కార్డులు ఇచ్చే ఉచిత కూపన్లు, బోనస్ పాయింట్లను ఉపయోగించి మీ ప్రయాణ ఖర్చులను భారీగా ఎలా ఆదా చేసుకోవాలో చూద్దాం..

ఈ కార్డులు ఉంటే చాలు.. అతి తక్కువ ధరకే ఫ్లైట్‌ ఎక్కొచ్చు..
6 Best Credit Cards For Flights
Krishna S
|

Updated on: Oct 25, 2025 | 7:30 AM

Share

మీరు తరచూ విమానంలో ప్రయాణం చేస్తుంటారా..? అయితే మీ ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవడానికి ఒక సులభమైన ఉపాయం ఉంది. అదే సరైన ట్రావెల్ క్రెడిట్ కార్డ్ వాడటం. పెద్ద పెద్ద బ్యాంకులు ఇస్తున్న ఈ కార్డులు, ఫ్లైట్ టికెట్లపై మంచి ఆఫర్లు, కూపన్లు, ఫ్రీ పాయింట్లను ఇస్తాయి. వీటిని వాడితే మీ టికెట్ రేటు తగ్గుతుంది, ప్రయాణం కూడా సౌకర్యంగా ఉంటుంది.

ట్రావెల్ కార్డులు ఎందుకు ముఖ్యమైనవి?

ఈ కార్డులు కేవలం డబ్బు చెల్లించడానికి మాత్రమే కాదు.. పొదుపు చేయడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. మీరు చేసే ప్రతి ప్రయాణ ఖర్చుపై పాయింట్లు వస్తాయి. ఆ పాయింట్లను మళ్లీ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. అందుకే మంచి ఆఫర్లు ఇచ్చే కార్డును ఎంచుకోవడం చాలా ముఖ్యం.

6 బెస్ట్ ట్రావెల్ క్రెడిట్ కార్డులు:

యాక్సిస్ బ్యాంక్ అట్లాస్ క్రెడిట్ కార్డ్: ఈ కార్డ్ ఏదైనా ఎయిర్‌లైన్‌లో ప్రయాణ ఖర్చులపై ప్రతి రూపాయి ఖర్చుకు 5 ఎడ్జ్ మైళ్లను అందిస్తుంది. ఇక్కడ ఒక మైలు విలువ రూ. 1 గా పరిగణిస్తారు. అదనంగా కార్డ్ యాక్టివేషన్ తర్వాత 37 రోజుల్లోపు మొదటి లావాదేవీకి 2,500 ఎడ్జ్ మైళ్ల స్వాగత బోనస్‌ను అందిస్తుంది.

అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్లాటినం ట్రావెల్ కార్డ్: ఈ కార్డు వార్షికంగా రూ. 1.9 లక్షలు ఖర్చు చేసినట్లయితే 15,000 పాయింట్లను, అలాగే రూ. 4 లక్షలు వార్షికంగా ఖర్చు చేస్తే 25,000 పాయింట్లను అందిస్తుంది. ఈ పాయింట్లను ప్లాటినం ట్రావెల్ కలెక్షన్ కింద ప్రయాణంలో ఉపయోగించుకోవచ్చు.

ఎస్‌బీఐ మైల్స్ ఎలైట్ కార్డ్: ఈ కార్డు 5,000 ట్రావెల్ క్రెడిట్‌ల సైన్-అప్ రివార్డ్‌తో వస్తుంది. ప్రతి రూ. 200 ఖర్చు చేయడం ద్వారా మీకు 6 ట్రావెల్ క్రెడిట్‌లు లభిస్తాయి. వీటిని ఎయిర్ మైల్స్, హోటల్ పాయింట్లుగా లేదా డైరెక్ట్ బుకింగ్‌లుగా మార్చుకోవచ్చు.

హెచ్‌డిఎఫ్‌సి 6E రివార్డ్స్ ఇండిగో కార్డ్: ఈ కార్డు ఇండిగో ప్రయాణీకులకు మాత్రమే ప్రత్యేకమైనది. ఇండిగో వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఖర్చు చేసే ప్రతి 100 రూపాయలకు మీరు 2.5 E రివార్డులను పొందుతారు. ఇది రూ. 1,500 విలువైన ఉచిత విమాన వోచర్‌ను కూడా అందిస్తుంది.

యాక్సిస్ బ్యాంక్ హారిజన్ క్రెడిట్ కార్డ్: ఈ కార్డుపై మీరు ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ లేదా యాక్సిస్ ట్రావెల్ ఎడ్జ్ సైట్‌లో ఖర్చు చేసే ప్రతి రూ.100 కి 5 ఎడ్జ్ మైళ్లు పొందుతారు. అలాగే మొదటి రూ.1,000 లావాదేవీపై 5,000 బోనస్ మైళ్లు కూడా స్వాగత ఆఫర్‌గా ఇవ్వబడతాయి.

ఐసీఐసీఐ స్కైవార్డ్స్ ఎమిరేట్స్ కార్డ్: ఈ కార్డ్ ప్రత్యేకంగా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రయాణీకుల కోసం ఉద్దేశించినది. అన్ని ఖర్చులపై స్కైవార్డ్స్ మైల్స్ అందుబాటులో ఉంటాయి. ఎమరాల్డ్, సఫైర్, రూబిక్ వంటి వివిధ కార్డ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. వీటిని మీ ఖర్చు అలవాట్ల ప్రకారం ఎంచుకోవచ్చు.

ఈ క్రెడిట్ కార్డులను సరైన విధంగా ఉపయోగించుకోవడం ద్వారా మీ ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవడమే కాక సౌలభ్యాన్ని, అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2026లో రాగి బంగారం అవుతుంది! పెట్టుబడి పెడితే..
2026లో రాగి బంగారం అవుతుంది! పెట్టుబడి పెడితే..
ఒకే రాయి పైకప్పుగా వేల ఇళ్లు.. ప్రకృతి వేసిన అద్భుత డిజైన్..!
ఒకే రాయి పైకప్పుగా వేల ఇళ్లు.. ప్రకృతి వేసిన అద్భుత డిజైన్..!
రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్
రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్
రూ. 30 వేల జీతంతో 10 ఏళ్లలో రూ. కోటి సంపాదన.. ఎలాగంటే..
రూ. 30 వేల జీతంతో 10 ఏళ్లలో రూ. కోటి సంపాదన.. ఎలాగంటే..
బ్యాట్ పడితే పరుగులు..గిటార్ పడితే పాటలు..అదరగొట్టిన జెమీమా
బ్యాట్ పడితే పరుగులు..గిటార్ పడితే పాటలు..అదరగొట్టిన జెమీమా
సంక్రాంతికి వా వాతియార్.. రిలీజ్ ఎప్పుడంటే..
సంక్రాంతికి వా వాతియార్.. రిలీజ్ ఎప్పుడంటే..
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే