AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: UPI వినియోగదారులకు గుడ్‌ న్యూస్.. పేమెంట్ యాప్‌లకు బిగ్ షాక్

UPI వినియోగదారులకు 'నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI) గుడ్‌ న్యూస్ చెప్పింది. దేశంలోని 50 కొత్త చెల్లింపు యాప్‌లలో UPI సేవలు త్వరలో రానున్నయి. కనీసం 50 కొత్త థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌లు ఇప్పుడు మార్కెట్‌లోకి ప్రవేశించాలనున్నట్లు తెలుస్తుంది.

UPI Payments: UPI వినియోగదారులకు గుడ్‌ న్యూస్.. పేమెంట్ యాప్‌లకు బిగ్ షాక్
50 New Payment Apps
Velpula Bharath Rao
|

Updated on: Oct 18, 2024 | 3:18 PM

Share

UPI చెల్లింపు వ్యవస్థ భారతదేశంలో డిజిటల్ చెల్లింపు అన్ని పరిమితులను మార్చింది. దేశంలోని 50 కొత్త చెల్లింపు యాప్‌లలో UPI సేవలు త్వరలో రానున్నయి. ఈ UPI చెల్లింపు సేవను నిర్వహించే ప్రభుత్వ సంస్థ ‘నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (NPCI) సీనియర్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. UPIలో ఆదాయ నమూనా లేకపోవడం వల్ల, కొత్త కంపెనీలు గత కొన్నేళ్లుగా ఈ విధానాన్ని అవలంబించకుండా ఉండవచ్చని చెప్పారు. అయితే గత ఒక సంవత్సరంలో, UPI చెల్లింపును ప్రారంభించేందుకు కొత్త కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. కనీసం 50 కొత్త థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌లు ఇప్పుడు మార్కెట్‌లోకి ప్రవేశించాలని చూస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు.

ప్రస్తుతం దేశంలో యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగా కొనసాగుతున్నాయి. ఫిన్‌టెక్ కంపెనీలు, బ్యాంకులు దీని ప్రాసెసింగ్ ఖర్చును భరిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో కూడా ఉచితంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మర్చంట్ డిస్కౌంట్ రేట్ లేదా MDR అంటే వాస్తవానికి చెల్లింపులను స్వీకరించడానికి వారి సేవలను ఉపయోగించే వ్యాపారుల నుండి కంపెనీలు రుసుం వసూలు చేస్తాయి. క్రెడిట్ కార్డ్ కంపెనీలకు ఇదే ప్రధాన ఆదాయ వనరు అని చెప్పాలి. UPI చెల్లింపులో MDR సౌకర్యం లేదు, ఎందుకంటే ఇది పీర్ 2 పీర్ నెట్‌వర్క్‌లో పని చేస్తుంది. అయితే, కొన్ని చెల్లింపు కంపెనీలు సౌండ్‌బాక్స్, డిజిటల్ క్యూఆర్ కోడ్, POS సిస్టమ్‌లను అభివృద్ధి చేయడం ద్వారా UPI చెల్లింపుల కోసం MDRకి ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి