
గత కొన్ని రోజులుగా బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఇంతలో, పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. పేదలకు అందని ద్రాక్షగా మారిన బంగారం.. ఇప్పుడు మధ్యతరగతి వారికి కూడా నగలు కొనడం కష్టంగా మారుతోంది. ఈ సంవత్సరం పెట్టుబడి బంగారం కొనుగోళ్లు, ఆభరణాల కొనుగోళ్ల కంటే బలంగా ఉన్నాయి. ఈ మేరకు వచ్చే 2026లో భారతదేశంలో బంగారం ధరను లెక్కిస్తున్నారు మార్కెట్ వర్గాలు. రాబోయే నెలల్లో బంగారం ధరలో మరో గణనీయమైన పెరుగుదల ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.
ఈ యేడు వేసవి కాలంలో బంగారం అమ్మకాలు బాగున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత సుమారు 10 నుండి 15 వరకు అమ్మకాలు జరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఆ తరువాత రోజుల తరబడి మాంద్యం కొనసాగిందని అంటున్నారు. ఇంతలో, మార్కెట్లో డిమాండ్ మళ్లీ పెరగడం ప్రారంభమైంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ఆభరణాల కొనుగోళ్లు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ కారణంగా ఆభరణాల కొనుగోళ్లు మళ్లీ పుంజుకుంటాయని అంటున్నారు.
గత వేసవిలో 40 నుండి 50 శాతం మంది వినియోగదారులు పాత బంగారు ఆభరణాలను కొత్త ఆభరణాలతో మార్పిడి చేసుకున్నట్టుగా చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత కాలంలో ఈ వాటా 20 నుండి 25 శాతం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రజలు సాధారణ బంగారు ఆభరణాల కంటే వజ్రాల ఆభరణాలను ఇష్టపడుతున్నారని చెబుతున్నారు.. భవిష్యత్తులో బంగారం ధర, ప్రపంచ కొనుగోళ్లు, దేశీయ డిమాండ్ మేరకు హెచ్చు తగ్గులు ఉంటాయని అంటున్నారు. రాబోయే నెలలు పెట్టుబడిదారులకు, కొనుగోలుదారులకు ముఖ్యమైనవి అంటున్నారు కొందరు మార్కెట్ విశ్లేషకులు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి