Gold and Silver Rates: బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు..! తగ్గాయా..? పెరిగాయా?
నేడు బంగారం ధర స్వల్పంగా రూ.10 పెరిగి, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.1,25,410కి చేరింది. వెండి ధర మాత్రం కిలోకు రూ.100 తగ్గి రూ.1,66,900గా నమోదైంది. హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

బంగారం, వెండి ధరలు స్వల్ప మార్పులతో స్థిరంగానే ఉన్నాయి. సోమవారంతో పోల్చుకుంటే.. మంగళవారం బంగారం ధర రూ.10 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) సోమవారం రూ.1,25,400 ఉండగా.. మంగళవారం ఉదయం రూ.1,25,410 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం రూ.1,14,960గా, 18 క్యారెట్ల బంగారం రూ.94,060గా ఉంది. సోమవారం కంటే ఇవి కూడా రూ.10 ధర పెరిగాయి.
ఇక నగరాల వారిగా చూసుకుంటే.. హైదరాబాద్‌లో ఒక గ్రాము బంగారం ధర రూ.12,541 (24 క్యారెట్లు), 11,496 (22 క్యారెట్లు), 9,406 (18 క్యారెట్లు)గా ఉంది. అలాగే ముంబై, కోల్‌కత్తా, బెంగళూరు, కేరళా, పూణెలో కూడా సేమ్ ధరలు ఉన్నాయి. చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్‌లో మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర 1,66,900లుగా నమోదైంది. సోమవారంతో పోలిస్తే.. రూ.100 ధర తగ్గింది. సోమవారం కేజీ వెండి రూ.1,67,000లుగా ఉంది. ఇక నగరాల పరంగా చూస్తే.. హైదరాబాద్‌లో రూ.1,72,900లుగా ఉంది. చెన్నై, కేరళా కూడా సేమ్ ఉన్నాయి. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కత్తా, పూణె, వడోదర, అహ్మదాబాద్‌లో కేజీ వెండి రూ.1,66,900లుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




