Indian Railways: భారత రైల్వే కీలక నిర్ణయం.. ఇక 200 కి.మీ వేగంతో పరుగెత్తనున్న ఆ రైళ్లు!

Indian Railways: ఐసిఎఫ్ కోచ్‌లను దశలవారీగా తొలగించాలని భారత రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లు ఇప్పటికే ప్రత్యేకంగా ఎల్‌హెచ్‌బి కోచ్‌లపై నడుస్తున్నాయి. సెంట్రల్ రైల్వే తాజా ప్రకటన ఈ పనులు మరింత వేగవంతం చేస్తుంది. ప్రయాణికులకు..

Indian Railways: భారత రైల్వే కీలక నిర్ణయం.. ఇక 200 కి.మీ వేగంతో పరుగెత్తనున్న ఆ రైళ్లు!
ట్రైన్‌ బయలుదేరడానికి 4 గంటల ముందు చివరి చార్ట్‌ తయారు అవుతుంది. అప్పటి వరకు టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంటుంది. సాధారణంగా ఈ చివరి చార్ట్ రైలు స్టేషన్ నుంచి బయలుదేరే 30 నిమిషాల ముందు తయారవుతుంది. అంటే, రైలు ప్రయాణానికి అరగంట ముందు వరకు కూడా సీట్లు ఖాళీగా ఉంటే టికెట్ బుక్ చేసుకోవచ్చు.

Updated on: Nov 25, 2025 | 4:39 PM

Indian Railways: గత కొన్ని సంవత్సరాలుగా భారత రైల్వేలు మౌలిక సదుపాయాల అప్‌డేట్లపై భారీగా దృష్టి సారించాయి. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో పెడుతున్నారు. రైలు ఇంజిన్లు, కోచ్‌ల నుండి రైల్వే ట్రాక్‌ల వరకు ప్రతిదానిని అప్‌గ్రేడ్ చేయడానికి పనులు జరుగుతున్నాయి. ప్రయాణికులు వీలైనంత త్వరగా వారి గమ్యస్థానాలకు చేరుకునేలా రైళ్ల సగటు వేగాన్ని పెంచాలని కూడా రైల్వేలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇంకా పూర్తి భద్రతతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారించడం భారతీయ రైల్వేలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందుకే పాత ICF (Integral Coach Factory) రైలు కోచ్‌లను కొత్త LHB (Linke Hofmann Busch Coaches) కోచ్‌లతో భర్తీ చేస్తున్నారు. ఇది ప్రయాణికులకు ఎక్కువ సౌకర్యాన్ని అందించడమే కాకుండా రైళ్ల సగటు వేగాన్ని కూడా పెంచుతుంది. LHB కోచ్‌లను ఇప్పటికే డజన్ల కొద్దీ ఏర్పాటు చేశారు.

వాటిని ఇతర వాటిపై కూడా అమర్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో కూడిన రైళ్లు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. సగటు వేగం గంటకు 160 కిలోమీటర్లు. అదే సమయంలో ఐసీఎఫ్‌ కోచ్‌లతో కూడిన రైళ్లు గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తాయి.

ఇది కూడా చదవండి: December Bank Holidays: డిసెంబర్‌లో 18 రోజులు బ్యాంకులకు సెలవు.. ఏయే రోజుల్లో అంటే..

ఇవి కూడా చదవండి

భారతీయ రైల్వేలు మొత్తం వ్యవస్థను ఆధునీకరించే దిశగా మరో ముఖ్యమైన అడుగు వేస్తోంది. సెంట్రల్ రైల్వే (CR) తన 16 రైళ్లలో పాత ICF (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్‌లను ఆధునిక LHB (లింకే హాఫ్‌మన్ బుష్) కోచ్‌లతో భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇవి అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత మెరుగ్గా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ రైల్వేలు క్రమంగా ఐసీఎఫ్‌ కోచ్‌లను ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో భర్తీ చేస్తోంది. ఇవి భారత్‌లోనే తయారు కానున్నాయి. ఈ కోచ్‌లు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేస్తారు. వాటి అత్యాధునిక సాంకేతికత కారణంగా డిమాండ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా సుదూర రైళ్లలో ఏర్పాటు చేస్తున్నారు.

LHB కోచ్ ఎందుకు మంచిది?

LHB కోచ్‌లు వాటి భద్రత, వేగానికి ప్రసిద్ధి చెందాయి. ప్రమాదం జరిగినప్పుడు ఒక కోచ్ మరొక కోచ్ పైకి ఎక్కడాన్ని నిరోధించే యాంటీ-క్లైంబింగ్ ఫీచర్స్‌ ఇందులో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో అగ్ని నిరోధక మెటీరియల్‌ను ఉపయోగిస్తారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు వేగం పరంగా ICF కోచ్‌ల కంటే కూడా ఉన్నతమైనవి. పాత కోచ్‌లు గరిష్టంగా 140 kmph వేగంతో ఉంటే LHB కోచ్‌లు 160 kmph వేగం, 200 kmph డిజైన్ వేగాన్ని కలిగి ఉంటాయి. ఇది రైల్వేల భవిష్యత్ హై-స్పీడ్ నెట్‌వర్క్‌కు ఒక ముఖ్యమైన పునాది వేస్తుంది.

Gold Price: ఈరోజు రూ. 5 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేస్తే 2030లో దాని విలువ ఎంత?

2030 నాటికి అన్ని ఐసిఎఫ్ కోచ్‌లను దశలవారీగా తొలగించాలని భారత రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లు ఇప్పటికే ప్రత్యేకంగా ఎల్‌హెచ్‌బి కోచ్‌లపై నడుస్తున్నాయి. సెంట్రల్ రైల్వే తాజా ప్రకటన ఈ పనులు మరింత వేగవంతం చేస్తుంది. ప్రయాణికులకు పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి, భద్రతా ప్రమాణాలను పెంచడానికి, ఆధునిక రైలు సాంకేతికతను స్వీకరించడానికి ఈ చర్య చాలా కీలకమైనది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి