Budget 2021-22: తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది సున్నా.. కేంద్రం బడ్జెట్ కేటాయింపులపై ఉత్తమ్ ఫైర్

కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది కేంద్ర బడ్జెట్‌లా లేదని.. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది సున్నా అని పేర్కొన్నారు.

Budget 2021-22: తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది సున్నా.. కేంద్రం బడ్జెట్ కేటాయింపులపై ఉత్తమ్ ఫైర్
Uttam-Kumar-Reddy
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 01, 2021 | 2:41 PM

Budget 2021-22: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది కేంద్ర బడ్జెట్‌లా లేదని.. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది సున్నా అని పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, అస్సాం, బెంగాల్ రాష్ట్రాలకు రూ. 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు కేటాయించారని..  అన్ని రాష్ట్రాలకు దక్కాల్సిన సొమ్మును కొన్ని రాష్ట్రాలకే పంచుతున్నారని ఆరోపించారు.  కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ బడ్జెట్ తయారు చేసినట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు. పెట్రోల్ మీద సెస్సుతో జనాన్ని బాదడం దారుణమన్నారు. జనం నడ్డి విరుస్తున్నారని..రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనడం పచ్చి అబద్ధమని పేర్కొన్నారు.

దేశంలో  రైతు ఆదాయం రెట్టింపు మాట దేవుడెరుగు కనీసం కొద్దిగా కూడా పెరగలేదని ఉత్తమ్ చెప్పారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీల సంగతి గాలికొదిలేశారని ఆరోపించారు.

Also Read:

Budget 2021-22: ఆంధ్రప్రదేశ్‌కి ఇదొక శరాఘాతం.. కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ రియాక్షన్..

Budget 2021-22: వేటి ధరలు పెరగనున్నాయి.. వేటి ధరలు తగ్గనున్నాయి.. తెలుసుకుందాం పదండి…

Petrol Rate hike : సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. పెట్రోల్ ఉత్పత్తులపై అగ్రిసెస్