Budget 2021: బడ్జెట్‌ రైతుకు ఊరటనిస్తుందా? ఆందోళనల దృష్ట్యా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి సాయం పెంచే అవకాశం!

రైతులను ఆకర్షించడానికి మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటుందని సమచారం. ఇప్పటికే వ్యవసాయ రంగంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం..

Budget 2021: బడ్జెట్‌ రైతుకు ఊరటనిస్తుందా? ఆందోళనల దృష్ట్యా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి సాయం పెంచే అవకాశం!
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 01, 2021 | 11:32 AM

Agriculture Budget 2021: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌ను ఈరోజు ప్రవేశపెడుతోంది. అయితే రైతులను ఆకర్షించడానికి మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటుందని సమచారం. ఇప్పటికే వ్యవసాయ రంగంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం ప్రముఖమైన పాత్ర పోషిస్తోంది. ఈ పథకం ద్వారా కేంద్రం తొలిసారిగా ఏటా రూ. 6వేలను మూడు విడతల్లో రూ. 2వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తోంది. ఈ మొత్తాన్ని మరింత పెంచాలని చాలా కాలంగా రైతు సంఘాలు, నిపుణులు కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సాయాన్ని పెంచితే రైతులకు మరింత లాభం చేకూరడంతోపాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

రైతు సాయాన్ని పెంచాలని ఎవరెవరు సూచించారంటే..

  • వ్యవసాయ నిపుణుడు వినోద్ ఆనంద్ కేంద్రం ఇస్తున్న సబ్సిడీని నిలుపుదల చేసి రైతులకు నేరుగా ఏటా 24 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
  • కిషన్ శక్తి సంఘ్ అధ్యక్షుడు పుష్పేంద్ర సింగ్ కూడా ఈ సాయాన్ని నెలకు రూ .2000 కు చొప్పున అందించాలని కోరారు.
  • పీఎం కిసాన్ పథకం కింద ఏటా రూ.12000 ఇవ్వాలని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం సూచించారు.
  • స్వామినాథన్ ఫౌండేషన్ కూడా ఈ సాయాన్ని రూ .15 వేలకు పెంచాలని సూచించింది.
  • ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్‌ ఈ సాయాన్ని రూ.8వేలు చేయాలని సూచించారు.

పిఎం కిసాన్ సమ్మాన్‌ పథకాన్ని 2019 ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. రైతులందరికీ ఈ పథకం ద్వారా రూ.6000లను.. రూ.2వేల చొప్పున మూడు విడతల్లో అందిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలోని 11.52 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరింది. దాదాపు ఏడు విడతల్లో ప్రభుత్వం నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసింది. 2021-22 బడ్జేట్‌లో మోదీ ప్రభుత్వం ఈ సాయాన్ని మరింత పెంచే అవకాశముందని తెలుస్తోంది.

Also Read:

Budget in Telugu 2021 LIVE: నేడే కేంద్ర ఆర్థిక బడ్జెట్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్

Budget 2021 Live Streaming: నేడే కేంద్ర ఆర్ధిక బడ్జెట్.. లైవ్ టెలికాస్ట్‌ను ఇలా వీక్షించండి..పూర్తి వివరాలు