దేవుడి దయ, ప్రజల ఆశీస్సులుతో…అధికారంలోకి రాబోతున్నాం- జగన్
హైదరాబాద్: దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి రాబోతున్నట్టు వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. పోలింగ్ టైం ముగిసిన అనంతంరం లోటస్ పాండ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటింగ్ శాతం తగ్గించేందుకు, ఎన్నికలు జరగకుండా ఆపేందుకు చంద్రబాబు చేసిన కుట్రలు ఫలించలేదని జగన్ అన్నారు. ఎన్నికల ప్రధాన అధికారిని కూడా బెదిరించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఇటువంటి పనులు చేసినందుకు ఆయన సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కృషి చేశారని […]
హైదరాబాద్: దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి రాబోతున్నట్టు వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. పోలింగ్ టైం ముగిసిన అనంతంరం లోటస్ పాండ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటింగ్ శాతం తగ్గించేందుకు, ఎన్నికలు జరగకుండా ఆపేందుకు చంద్రబాబు చేసిన కుట్రలు ఫలించలేదని జగన్ అన్నారు. ఎన్నికల ప్రధాన అధికారిని కూడా బెదిరించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఇటువంటి పనులు చేసినందుకు ఆయన సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల దగ్గర వైఎస్సార్ సీపీ నాయకులపై, కార్యకర్తలపై జరిగిన దాడులను జగన్ ప్రస్తావించారు. పోలింగ్ సందర్భంగా వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు చనిపోయారని, వారికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. మహిళా ఓటర్లు కూడా వైసీపీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.