Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayasai reddy : ‘ప్రజల పట్ల ఏ బాధ్యత లేని మీకు రాజకీయాలెందుకు? .. వాతలు పెట్టినా బుద్ధి రాకపోతే మీ ఖర్మ.!’

YCP Mp Vijayasai reddy slams Chandrababu : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు, తెలుగు దేశం పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు..

Vijayasai reddy : 'ప్రజల పట్ల ఏ బాధ్యత లేని మీకు రాజకీయాలెందుకు? .. వాతలు పెట్టినా బుద్ధి రాకపోతే మీ ఖర్మ.!'
Vijayasai Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: May 18, 2021 | 10:39 AM

YCP Mp Vijayasai reddy slams Chandrababu : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు, తెలుగు దేశం పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. నరసాపురం ఎంపీ రఘురామరాజు అరెస్ట్ వ్యవహారంపై నానా రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “కరోనా కట్టడి, చికిత్సకు రాష్ట్రం స్పందించిన తీరును ప్రధాని, కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రశంసించినా పచ్చ పార్టీ పెద్దలకు అరెస్ట్ గొడవ తప్ప మరేమీ పట్టడం లేదు. ప్రజల పట్ల ఏ బాధ్యత లేని మీకు రాజకీయాలెందుకు? రెండేళ్లలో జరిగిన ప్రతి ఎన్నికలో వాతలు పెట్టినా బుద్ధి రాకపోతే మీ ఖర్మ!” అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అంతేకాదు,  “కస్టడీలో ఉన్నఎంపీని కొట్టి హింసించారని చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా హోరెత్తించిన అసత్యపు ప్రచారం ఈ ఏడాది ప్రపంచస్థాయి ‘పచ్చి అబద్ధాల’ పోటీలో ఫస్ట్ ప్రైజుకు ఎంపికైనట్టే. కొన్నేళ్లుగా ఈ పురస్కారం బాబు, పచ్చ పార్టీ ప్రముఖులకే దక్కుతుండటం తెలుగు ప్రజల గ్రహచారం.” అంటూ విజయసాయి వివరుచుకుపడ్డారు. ఇలా ఉండగా, విశాఖపట్నం షీలానగర్‌లో కొవిడ్ కేర్ సెంటర్‌ను సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఎంపీ విజయసాయి రెడ్డి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 30 మంది వైద్యులు, 90 మంది నర్సులతో ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ప్రగతి భారత్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 300 ఆక్సిజన్‌ బెడ్లుతో కరోనా రోగులకు ఉచిత వైద్య, భోజన సేవలు అందిస్తున్నారు.

Read also : Matsyakara Bharosa : గంగ పుత్రులకు ఈరోజు ‘మత్స్యకార భరోసా’ సొమ్ములు.. ఇతర వర్గాలకూ అర్హత కల్పించిన జగన్ ప్రభుత్వం