బెంగాల్ ను వీడని నారదా కేసు, ఇద్దరు మంత్రులు సహా నలుగురు జైలుకు తరలింపు, అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఇద్దరు నేతలు

నారదా కేసు 'తీవ్రత' బెంగాల్ ను ఇంకా వీడలేదు. గతరాత్రి పొద్దు[పోయిన తరువాత కోల్ కతా లో అత్యంత నాటకీయ పరిణామాలు జరిగాయి. ఇద్దరు మంత్రులతో సహా నలుగురిని ఈ తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో అధికారులు జైలుకు తరలించారు.

బెంగాల్ ను  వీడని నారదా కేసు, ఇద్దరు మంత్రులు సహా నలుగురు జైలుకు తరలింపు, అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఇద్దరు నేతలు
Mamata Banerjee
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 18, 2021 | 11:41 AM

నారదా కేసు ‘తీవ్రత’ బెంగాల్ ను ఇంకా వీడలేదు. గతరాత్రి పొద్దు పోయిన తరువాత కోల్ కతా లో అత్యంత నాటకీయ పరిణామాలు జరిగాయి. ఇద్దరు మంత్రులతో సహా నలుగురిని ఈ తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో అధికారులు జైలుకు తరలించారు. ఈ కేసులో వీరికి సీబీఐ స్పెషల్ కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసినప్పటికీ దాన్ని సవాలు చేస్తూ సీబీఐ కలకత్తా హైకోర్టుకెక్కింది. దాంతో హైకోర్టు వీరి బెయిలుపై స్టే విధించింది. పర్యవసానంగా వీరిని మళ్ళీ సీబీఐ అరెస్టు చేసి జైలుకు తరలించింది. మంత్రులు సుబ్రతా ముఖర్జీ, ఫిర్హాద్ హకీమ్, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్ర, ఈ పార్టీ మాజీ నేత సోవన్ ఛటర్జీలను ఈ ఉదయం ప్రెసిడెన్సీ కరెక్షన్ హోంకు తరలించారు. కాగా ఈ తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో తమకు శ్వాస సరిగా ఆడడంలేదని మదన్ మిత్ర, సోవన్ ఛటర్జీ చెప్పడంతో వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెడికల్ చెకప్ కోసం సుబ్రతా ముఖర్జీని కూడా తీసుకువెళ్లి మళ్ళీ జైలుకు తరలించారు. నిన్న వీరి అరెస్టును నిరసిస్తూ సీఎం మమతా బెనర్జీ సుమారు ఆరు గంటలపాటు సీబీఐ కార్యాలయంలోనే ఉన్నారు. వీరిని విడుదల చేయాలంటూ ఒక దశలో ధర్నాకు కూర్చున్నారు. తనను కూడా అరెస్టు చేయాలని ఆమె సవాల్ చేశారు.

అటు-సీబీఐ ఆఫీసు వద్ద మీడియాతో మాట్లాడిన మదన్ మిత్ర.. సువెందు అధికారి, ముకుల్ రాయ్ లను కూడా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. నారదా స్టింగ్ ఆపరేషన్ లో వీరి పేర్లు కూడా బయటపడ్డాయన్నారు. సువెందు అధికారి, ముకుల్ రాయ్ ఇద్దరూ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఇక తను బందిపోటును కానని, తన బెడ్ రూమ్ లో ప్రవేశించి తనను అరెస్టు చేశారని సోవన్ ముఖర్జీ ఆగ్రహంతో ఊగిపోయారు. 2016 లో జరిగిన నారదా స్టింగ్ ఆపరేషన్ లో 13 మంది నేతల బాగోతం వెలుగులోకి వచ్చింది.

మరిన్ని  ఇక్కడ చూడండి: Etela : ఈటల శాపనార్థాలు : ‘బిడ్డా గుర్తు పెట్టుకో.. నువ్వు ఎన్ని టాక్స్‌లు ఎగగొట్టినవో తెలవదు అనుకుంటున్నావా.?’

స్మోకింగ్ చేస్తూ.. హ్యాండ్స్ శానిటైజ్ చేసుకున్నాడు.. చివరికి ఏమి జరిగిందంటే…?? ( వీడియో )

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు