AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదిగో.. ఎగిరే ఉడుత

అంతరించిపోయిందనుకుంటున్న ఎగిరే ఉడుత భారత దేశంలో కనిపించింది. ఈ ఉడుతను ఇప్పటికే రెడ్ లిస్ట్‌లో చేర్చింది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్

ఇదిగో.. ఎగిరే ఉడుత
Sanjay Kasula
|

Updated on: Aug 17, 2020 | 1:45 PM

Share

Woolly Flying Squirrel Found in Uttarakhand : అంతరించిపోయిందనుకుంటున్న ఎగిరే ఉడుత భారత దేశంలో కనిపించింది. ఈ ఉడుతను ఇప్పటికే రెడ్ లిస్ట్‌లో చేర్చింది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN). ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉండుత జాతి పూర్తి స్థాయిలో కనిపించకుండా పోయింది.

అయితే అకస్మత్తుగా ఈ ఎగిరే ఉడత ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలో కనపించింది. గంగోత్రి నేషనల్ పార్క్‌లో సోమవారం ఈ ఊలి ఫ్లయింగ్‌ స్క్వెరల్‌ ఎగురుతూ కనిపించింది. 70 ఏండ్ల క్రితమే ఈ ఉడుత అంతరించిపోయినట్లు అటవీ పరిశోధన సంస్థ తెలిపింది. అయితే ఇంత కానికి ఈ ఉడతను అటవి అధికారులు చూడటంతో ఓ ఫోటోను కూాడా వారు తీశారు.

ఉత్తరాఖండ్‌లోని 18 అటవీ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో 13 చోట్ల ఈ ఉడుతను గుర్తించినట్లు సంస్థ ఆ పేర్కొంది. డెహ్రాడూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా (WII) శాస్త్రవేత్తలు భగీరథ లోయలో ఇవి ఉన్నట్లుగా తెలిపారు. వాటి ఫొటోలను సైతం తమకు అందజేశారని  ప్రకటించింది. ఈ ఉడుత ఎగిరేందుకు తన శరీర వెంట్రుకలకు ఉన్న పంజాలను పారాచూట్‌లా వినియోగించుకుంటుందని వివరించింది.