AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళా కాంగ్రెస్ కార్యకర్తపై మూకుమ్మడి దాడి

యూపీలోని దేవరియాలో తారా యాదవ్ అనే మహిళా కాంగ్రెస్ కార్యకర్తపై ఆ పార్టీ నేతలే దాడికి పాల్పడ్డారు. రానున్న ఉప ఎన్నికలో ముకుంద్ భాస్కర్ అనే రేపిస్టుకు పార్టీ టికెట్ కేటాయించడంపై మండిపడిన  తారా యాదవ్…ఇదేమని ప్రశ్నించబోగా సాక్షాత్తూ కాంగ్రెస్ నేతలు, కొందరు కార్యకర్తలే ఆమెపై ఎటాక్ కి దిగారు; అయితే చలించని తారా యాదవ్.. తాను ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సచిన్ నాయక్..కొందరు కార్యకర్తలతోసమావేశం […]

మహిళా కాంగ్రెస్ కార్యకర్తపై మూకుమ్మడి దాడి
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 11, 2020 | 1:49 PM

Share

యూపీలోని దేవరియాలో తారా యాదవ్ అనే మహిళా కాంగ్రెస్ కార్యకర్తపై ఆ పార్టీ నేతలే దాడికి పాల్పడ్డారు. రానున్న ఉప ఎన్నికలో ముకుంద్ భాస్కర్ అనే రేపిస్టుకు పార్టీ టికెట్ కేటాయించడంపై మండిపడిన  తారా యాదవ్…ఇదేమని ప్రశ్నించబోగా సాక్షాత్తూ కాంగ్రెస్ నేతలు, కొందరు కార్యకర్తలే ఆమెపై ఎటాక్ కి దిగారు; అయితే చలించని తారా యాదవ్.. తాను ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సచిన్ నాయక్..కొందరు కార్యకర్తలతోసమావేశం నిర్వహిస్తుండగా ఆమె అక్కడికి చేరుకొని ముకుంద్ నీచ చరిత్రను లేవనెత్తారు. ఆమెపై దాడిని బీజేపీ నేతలు కూడా తీవ్రంగా ఖండించారు.