అయోధ్య తీర్పు చెప్పబోయే న్యాయమూర్తులు వీరే..!
అయోధ్య భూవివాదం కేసులో తీర్పు చెప్పబోయే ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సీజేఐ రంజన్ గొగోయ్ సారథ్యం వహించనున్నారు. జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లు ధర్మాసనంలోని ఇతర నలుగురు సభ్యులు. ఈ కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ నజీర్ ఒక్కరే ముస్లిం న్యాయమూర్తి. కాగా నేడు తీర్పు నేపథ్యంలో న్యాయమూర్తుల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన న్యాయమూర్తి […]
అయోధ్య భూవివాదం కేసులో తీర్పు చెప్పబోయే ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సీజేఐ రంజన్ గొగోయ్ సారథ్యం వహించనున్నారు. జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లు ధర్మాసనంలోని ఇతర నలుగురు సభ్యులు. ఈ కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ నజీర్ ఒక్కరే ముస్లిం న్యాయమూర్తి. కాగా నేడు తీర్పు నేపథ్యంలో న్యాయమూర్తుల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కు జెడ్ ప్లస్ క్యాటగిరీ కల్పించారు. భారీ భద్రత మధ్య జడ్జీలు కోర్టుకు వెళ్లనున్నారు. విద్యాసంస్థలకు ముందుగానే సెలవలు ప్రకటించారు.