AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్య కేసు: అసలు వివాదం ఏంటి..?

దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారడంతో పాటు.. హిందూ ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసుపై నేడు తీర్పు వెలువడనుంది.  ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కీలక జడ్జిమెంట్ వెలువడనున్నట్టు సమాచారం. అసలు వివాదం : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో 2.77 ఎకరాల చుట్టారా వివాదం రాజుకుంది.  హిందూ దేవుడైన రాముడి జన్మస్థలంగా పరిగణించే స్థలంతో పాటు.. బాబ్రీ మసీదు కూడా ఉన్న స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. ప్రధానంగా ఈ స్థలాన్ని సందర్శించటానికి […]

అయోధ్య కేసు: అసలు వివాదం ఏంటి..?
Ram Naramaneni
| Edited By: |

Updated on: Nov 09, 2019 | 10:43 AM

Share

దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారడంతో పాటు.. హిందూ ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసుపై నేడు తీర్పు వెలువడనుంది.  ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కీలక జడ్జిమెంట్ వెలువడనున్నట్టు సమాచారం.

అసలు వివాదం :

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో 2.77 ఎకరాల చుట్టారా వివాదం రాజుకుంది.  హిందూ దేవుడైన రాముడి జన్మస్థలంగా పరిగణించే స్థలంతో పాటు.. బాబ్రీ మసీదు కూడా ఉన్న స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. ప్రధానంగా ఈ స్థలాన్ని సందర్శించటానికి అనుమతి విషయంలో అసలు అగ్గి రాజుకుంది. అసలు ఇక్కడ మసీదు నిర్మించడానికి ముందు..  అంతకుముందు ఉన్న హిందూ దేవాలయాన్ని కూల్చివేశారన్న ఆరోపణలపై కూడా ఈ కేసు డిపెండ్ అయి ఉంది.

రాముడి జన్మభూమిలోని ఆలయాన్ని కూల్చేసి.. మసీదును నిర్మించారనే ఆగ్రహంతో 1992 డిసెంబర్ 6వ తేదీన కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేశారు. దీంతో ఇది మరింతగా చర్చనీయాంశమైంది.  ఆ ఉదంతం తర్వాత ఆ భూమి మీద యాజమాన్యానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది. ఆ కేసులో 2010 సెప్టెంబర్ 30వ తేదీన తీర్పు ప్రకటించారు. అలహాబాద్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు.. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించాలని.. అందులో ఒక భాగం హిందూ మహా సభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు వెళుతుందని తీర్పు చెప్పారు. ఈ సందర్బంగా అయోధ్య వంటి సున్నితమైన కేసు విషయం లో నిర్ణయం తీసుకోవడం ఎంత కష్టతరమో కోర్టు తన ఉత్తర్వులలో వెల్లడించింది. “ఈ చిన్న భూభాగం మీద అడుగుపెట్టడానికి దేవతలు కూడా భయపడతారు. దీని నిండా మందుపాతరలున్నాయి. దానిని మేము శుభ్రం చేయాల్సి ఉంది.” అంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే, 2010 నాటి తీర్పుకు వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు అప్పీలు చేయటంతో ఆ తీర్పును సుప్రీంకోర్టు 2011లో సస్పెండ్ చేసింది.

న్యాయమూర్తుల మధ్య భిన్న వాదనలు..

అయితే 2010లో ఇచ్చిన తీర్పులో త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు హిందువు త్రిమూర్తులు.. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ నిర్మించిన ఆ భవనం నిజానికి మసీదు కాదని  పేర్కొన్నారు. కూల్చి వేసిన హిందూ దేవాలయంలో ఇస్లాం సూత్రాలకు వ్యతిరేకంగా దానికి నిర్మించారని వ్యాఖ్యానించారు. ఈ ధర్మాసనంలో ఉన్న ముస్లిం న్యాయమూర్తి ఒకరు ఈ అభిప్రాయంతో విభేదించారు. అక్కడ ఏ ఆలయాన్ని ధ్వంసం చేయలేదనీ, ఆ మసీదుని శిథిలాల మీద నిర్మించారని ఆయన వాదించారు. కాగా తాజా తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకుంది.