దిల్‌రాజు వెడ్స్ తేజస్విని.. మాతృదినోత్సవం రోజు కొత్త జీవితం

దిల్‌రాజు వెడ్స్ తేజస్విని.. మాతృదినోత్సవం రోజు కొత్త జీవితం

ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత దిల్ రాజు (49) ఆదివారం మాతృదినోత్సవం రోజు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొద్ది నెలలుగా దిల్‌ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్న వేళ.. వాటిని నిజం చేస్తూ ఆయన ఆదివారం తన సొంతూరు నిజమాబాద్‌ జిల్లాలోని..

TV9 Telugu Digital Desk

| Edited By:

May 11, 2020 | 5:19 PM

ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత దిల్ రాజు (49) ఆదివారం మాతృదినోత్సవం రోజు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొద్ది నెలలుగా దిల్‌ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్న వేళ.. వాటిని నిజం చేస్తూ ఆయన ఆదివారం తన సొంతూరు నిజమాబాద్‌ జిల్లాలోని నర్సింగ్ పల్లిలో వెంకటేశ్వర స్వామి గుడిలో వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబసభ్యుల మధ్య ఆయన వివాహం జరిగింది. అయితే పెళ్లి కూతరు ఎవరు? ఏం చేస్తుందని అనే సందేహం అందరిలోనూ మొదలైంది. దిల్ రాజు వాళ్ల బంధువులకు తలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తన పేరు తేజస్విని. గతంలో ఆమె ఎయిర్ హోస్టెస్ పని చేసిందట.

కాగా మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత.. అనారోగ్యంతో 2017లో కన్ను మూశారు. అప్పటి నుంచీ ఆయన ఒంటరిగానే ఉంటున్నారు. దీంతో అది గమనించిన దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి ఎలాగైనా మళ్లీ పెళ్లి చేయాలని అనుకుంది. బరువైన బాధ్యతను భుజాన వేసుకుని వేసుకుని పెళ్లి పెద్దగా వ్యవహరించింది. మొత్తానికి తన తండ్రికి రెండో పెళ్లి చేసింది.

దిల్‌రాజు వివాహం అనంతరం కూతురు హర్షిత రెడ్డి తన తండ్రికి ఓ లేఖ రాసింది. ‘ప్రియమైన నాన్న… నా జీవితంలో మీరు ఎల్లప్పుడు అండగా ఉంటూ.. ముందుకు నడిపించారు. మన కుటుంబ సంతోషమే మీ జీవితంగా అన్నింటికన్నా అత్యంత ప్రధాన్యమైన విషయంగా జీవించారు. మీరు సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా మీ ఇద్దరికి నా అభినందనలు. మీ జీవితంలో ప్రతిరోజు, ప్రేమ, సంతోషంతో నిండాలని.. సరికొత్త అనుభూతులని అందించాలని కోరుకుంటున్నా’ అంటూ లేఖ రాసింది హర్షిత రెడ్డి.

Read More: విపరీతంగా పెరిగిపోతున్న చికెన్ ధరలు.. 15 రోజులుల్లో రూ.80 పెంపు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu