విపరీతంగా పెరిగిపోతున్న చికెన్ ధరలు.. 15 రోజులుల్లో రూ.80 పెంపు

హైదరాబాద్‌ నగరంలో చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా కారణంగా నిన్న మొన్నటివరకూ ఎవరూ చికెన్ తినేవారు కాదు. కనీసం బతికున్న కోడిని ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకునే..

విపరీతంగా పెరిగిపోతున్న చికెన్ ధరలు.. 15 రోజులుల్లో రూ.80 పెంపు
Follow us

| Edited By:

Updated on: May 11, 2020 | 10:08 AM

హైదరాబాద్‌ నగరంలో చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా కారణంగా నిన్న మొన్నటివరకూ ఎవరూ చికెన్ తినేవారు కాదు. కనీసం బతికున్న కోడిని ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకునే వారు కనిపించలేదు. దీంతో పెంపకం, మేత ఖర్చులు కూడా రాక రైతులు నష్టాలను చవిచూశారు. అయితే చికెన్‌పై ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు సెలబ్రిటీలు, వైద్యులు కూడా అవగాహన పెంచడంతో.. చాలా మంది చికెన్ తినేందుకు ఆసక్తి చూపించారు. దీంతో ఇది గమనించిన మాంసం దుకాణాదారులు విపరీతంగా రేట్లు పెంచేశారు. గత నెల రోజుల క్రితం కిలో చికెన్‌ రూ.50-60లకి దొరికేది. కానీ ప్రస్తుతం కిలో రూ. 180 నుంచి 200లకి అమ్ముతున్నారు.

కాగా నగరంలోని పలు ప్రాంతాల్లో 15 రోజుల క్రితం చికెన్ ధర రూ.120లు ఉండగా, ప్రస్తుతం రూ.80 అందనంగా పెరిగింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో అయితే కిలో రూ.220లకి కూడా అమ్ముతున్నారు వ్యాపారులు. నగరంలో ఒకేసారి పెంచిన చికెన్ ధరలతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా నుంచి ఉపశమనం పొందేందుకు చికెన్ తింటుంటే.. వ్యాపారులు మాత్రం వైరస్‌ను అడ్డుపెట్టుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని అధిక రేట్లను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఇప్పటికే మటన్ అమ్మకంపై కూడా తెలంగాణ ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Read More:

ఈ రోజు రాత్రికే గుడిలో ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి..

గుండెపోటుతో యంగ్ డైరెక్టర్ మృతి.. షాక్‌లో సినీ ప్రముఖులు