నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో భరత్ కమ్మ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మే 22న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. మార్చి 17న డియర్ కామ్రేడ్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అలాగే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీని విడుదల చేయనున్నట్లు పోస్టర్‌లో తెలిపింది. ఈ నాలుగు […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:58 am, Fri, 8 March 19
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో భరత్ కమ్మ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మే 22న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. మార్చి 17న డియర్ కామ్రేడ్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అలాగే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీని విడుదల చేయనున్నట్లు పోస్టర్‌లో తెలిపింది. ఈ నాలుగు భాషల్లో విజయ్ దేవరకొండకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో మెడికల్ స్టూడెంట్‌గా విజయ్, క్రికెటర్‌గా రష్మిక కనిపించనున్న విషయం తెలిసిందే.