వడ్డీ రేట్లను తగ్గించిన యూనియన్ బ్యాంక్

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌.. మార్జినల్‌ కాస్ట్‌ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను స్వల్పంగా తగ్గించింది. వివిధ కాలపరిమితి గల రుణాలపై వడ్డీరేటును 0.10 శాతం తగ్గించింది. సవరించిన రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8.70 శాతం నుంచి 8.60 శాతానికి తగ్గింది. ఆరునెలల ఎంసీఎల్‌ఆర్‌ను 8.50 శాతానికి కుదించింది. మరోవైపు బేస్‌రేటును 0.10 శాతం తగ్గించింది. 9.10 శాతం నుంచి […]

  • Ram Naramaneni
  • Publish Date - 1:23 pm, Sat, 2 March 19
వడ్డీ రేట్లను తగ్గించిన యూనియన్ బ్యాంక్

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌.. మార్జినల్‌ కాస్ట్‌ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను స్వల్పంగా తగ్గించింది. వివిధ కాలపరిమితి గల రుణాలపై వడ్డీరేటును 0.10 శాతం తగ్గించింది. సవరించిన రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8.70 శాతం నుంచి 8.60 శాతానికి తగ్గింది. ఆరునెలల ఎంసీఎల్‌ఆర్‌ను 8.50 శాతానికి కుదించింది. మరోవైపు బేస్‌రేటును 0.10 శాతం తగ్గించింది. 9.10 శాతం నుంచి 9 శాతానికి బేస్‌రేటును కుదించినట్లు బ్యాంక్‌ తెలిపింది.