ఎవరు జాతీయవాదులు.. ఎవరు జాతి వ్యతిరేకులు..!

2012 లో అక్బీ రసూల్ కాశ్మీర్లో 12 ఏళ్ళ బాలుడు తన ఫేస్‌బుక్‌లో పాకిస్థాన్ జెండాను ప్రొఫైల్‌గా పెట్టాడు. ఇది జరిగి ఏడు సంవత్సరాలు గడిచిపోగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 17న హిమాచల్ ప్రదేశ్ పోలీసులు రసూల్‌కు జైలు శిక్ష విధించారు. ఫిబ్రవరి 14న పుల్వామా బాంబు దాడి తరువాత జాతీయవాదం పేరుతో కొందరు రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో వైఎస్ పార్మర్ యూనివర్సిటీలో చదువుతున్న కశ్మీర్‌కు చెందిన రసూల్, పీర్ జదా టబీస్ ఫయాస్ అనే ఇద్దరు […]

ఎవరు జాతీయవాదులు.. ఎవరు జాతి వ్యతిరేకులు..!
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2019 | 2:42 PM

2012 లో అక్బీ రసూల్ కాశ్మీర్లో 12 ఏళ్ళ బాలుడు తన ఫేస్‌బుక్‌లో పాకిస్థాన్ జెండాను ప్రొఫైల్‌గా పెట్టాడు. ఇది జరిగి ఏడు సంవత్సరాలు గడిచిపోగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 17న హిమాచల్ ప్రదేశ్ పోలీసులు రసూల్‌కు జైలు శిక్ష విధించారు. ఫిబ్రవరి 14న పుల్వామా బాంబు దాడి తరువాత జాతీయవాదం పేరుతో కొందరు రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో వైఎస్ పార్మర్ యూనివర్సిటీలో చదువుతున్న కశ్మీర్‌కు చెందిన రసూల్, పీర్ జదా టబీస్ ఫయాస్ అనే ఇద్దరు అరెస్ట్ చేయాలంటూ యూనివర్సిటీలోని ఓ మూక డిమాండ్ చేసింది. మూక ఫిర్యాదుతో పోలీసులు కూడా వారిపై కేసు నమోదు చేశారు. తెలియని వయస్సులో వీరిద్దరు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టగా.. దానికి ఇప్పుడు బాధ్యులుగా మారారు.

ఆ తరువాత బెయిల్ కోసం రసూల్‌ కుటుంబసభ్యులు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే స్థానిక న్యాయవాదులు జిల్లా కోర్టును అడ్డుకున్నారు. అతడికి తరపున వాదించేందుకు వారు నిరాకరించారు. దీంతో వారు షిమ్లా హైకోర్టును ఆశ్రయించగా.. ఆ న్యాయస్థానం కూడా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై మళ్లీ స్థానిక కోర్టును ఆశ్రయించాలంటూ సూచించింది. దీంతో రసూల్ తల్లిదండ్రులు సోలన్ జిల్లా కోర్టును ఆశ్రయించగా.. మార్చ్ 1న ఆ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అది కూడా పూర్తి స్థాయిలో కాదు. ఎప్పుడూ పిలిచినా అతడు విచారణకు రావాలని సూచిస్తూ బెయిల్ ఇచ్చింది.

ఇలాంటి కేసుల విషయంలో విద్యా సంస్థల యాజమాన్యం, పోలీసులు, కోర్టులు, న్యాయవాదులు అందరూ జాతీయవాదం పేరుతో రెచ్చిపోతున్నారు. చిన్న వయసులో తెలీక చేసిన తప్పుపై ఆలోచించాల్సింది పోయి కొందరిని టార్గెట్ చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా కశ్మీరీలు ఈ కేసులలో బాధితులుగా ఉన్నారని పలువురు అంటున్నారు. వీరి విషయంలో యూనివర్సిటీలు, పోలీసులు, విద్యార్థులు వ్యతిరేకంగా నిలుస్తున్నారని కొందరు కశ్మీర్‌లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

దేశం మొత్తం మీద చూస్తే కశ్మీర్‌లో పరిస్థితులు వేరుగా ఉంటాయి. జాతి వ్యతిరేకుల పేరుతో కొంతమందిని పోలీసులు హింసించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని పక్కనపెట్టి ఉన్నత విద్యను అభ్యసించాలనుకుని పక్క రాష్ట్రాలకు వెళ్లే వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది. ముఖ్యంగా దేశంలో దాడులు జరిగినప్పుడు కశ్మీరీలను బాధ్యులు చేస్తుండటం వారిని బాధిస్తోంది. తాము ఈ దేశంలో భాగం అని అనుకుంటున్నామని, కానీ కొందరు మాత్రం తమను జాతి వ్యతిరేకులుగా చూస్తున్నారని రసూల్ సోదరుడు ముదస్సిర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దేశంలో జరిగే అన్ని గణతంత్ర, స్వతంత్ర వేడుకల్లో పాల్గొనే తన తమ్ముడిని ఉన్నట్లుండి జాతి వ్యతిరేకిగా మార్చారని ముదస్సిర్ చెప్పాడు.

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్