ఢిల్లీలో తెలంగాణ బీజేపీ హల్‌చల్
ఒకవైపు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలజగడాన్ని పరిష్కరించుకునేందుకు అపెక్స్ కమిటీ ముందు సమావేశం కాబోతున్న తరుణంలో తెలంగాణ బీజేపీ నేతలు న్యూఢిల్లీలో హల్ చల్ చేశారు.
Telangana BJP leaders hull-chal in Newdelhi: ఒకవైపు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలజగడాన్ని పరిష్కరించుకునేందుకు అపెక్స్ కమిటీ ముందు సమావేశం కాబోతున్న తరుణంలో తెలంగాణ బీజేపీ నేతలు న్యూఢిల్లీలో హల్ చల్ చేశారు. ఏపీ, తెలంగాణా భవన్‌ల ఎదుట ధర్నాకు దిగారు. తెలంగాణ నీటి హక్కులు కాపాడాలంటూ దీక్ష చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలపై రాజీపడుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు సారథ్యంలో కమలం పార్టీ శ్రేణులు న్యూఢిల్లీలో ధర్నా నిర్వహించారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో జరుగుతున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నించాలని ధర్నా నుద్దేశించి ప్రసంగించిన కృష్ణసాగర్ రావు డిమాండ్ చేశారు.
తెలంగాణ నీటి హక్కులు పరిరక్షించబడాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ పనులను నిలిపి వేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కృష్ణా నదీ జలాలను పెన్నా రీజియన్‌కు తరలించాలన్న ఏపీ ప్రభుత్వ చర్యలు జాతీయ, అంతర్జాతీయ నదీ ఒప్పందాలకు విరుద్ధమని కృష్ణసాగర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడితే రాష్ట్ర ప్రజలు క్షమించబోరని ఆయన వ్యాఖ్యానించారు.
Also read: Dubbak By-poll: ప్రధాన పార్టీల అభ్యర్థులపై క్లారిటీ