ఓటీటీలో స్టార్ హీరో మూవీ.. క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం

ప్పుడు తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ నటించిన ''మాస్టర్'' సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. విజయ్ సినిమా డైరెక్ట్ ఓటీటీలో విడుదల అవడం ఏంటని తమిళ దర్మక నిర్మాతలు షాక్ అయ్యారు. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నట్లుగా..

ఓటీటీలో స్టార్ హీరో మూవీ.. క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 25, 2020 | 1:51 PM

కరోనా మహమ్మారి దెబ్బకు సినీ ఇండస్ట్రీ పరిస్థితులన్నీ పూర్తిగా తారుమారయ్యాయి. మార్చి నుంచి ఇప్పటివరకూ థియేటర్స్ కూడా తెరవలేదు. దీంతో రిలీజ్‌కు విడుదలైన సినిమాలన్నీ ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాని, సుధీర్ బాబుల ‘వి’ సినిమాతో పాటు పలు సినిమాలో ఓటీటీలో సందడి చేస్తున్నాయి. కాగా ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ నటించిన ”మాస్టర్” సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. విజయ్ సినిమా డైరెక్ట్ ఓటీటీలో విడుదల అవడం ఏంటని తమిళ దర్మక నిర్మాతలు షాక్ అయ్యారు. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నట్లుగా.. అది కూడా నవంబర్ 14వ తేదీన రిలీజ్ అవుతున్నట్లు.. మాస్టర్ చిత్రం పోస్టర్‌లో ఉంది.

తాజాగా ఈ రూమర్స్‌పై ‘మాస్టర్స్’ చిత్ర బృందం స్పందించింది. ఆ పోస్టర్‌లో నిజం లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ సినిమా విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుతం విజయ్ సినిమాలు వరుసగా 100 కోట్లకు పైగానే రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్టర్ సినిమాను డిజిటల్‌లో రిలీజ్ చేస్తే నష్టం వస్తుందని అందుచేత.. ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా థియేటర్‌లోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

Read More:

కోవిడ్ భయంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య

వినూత్న ప్రయోగం.. వాట్సాప్‌లో గణేష్ లడ్డూ వేలం

బిగ్‌బాస్-4 ఎంట్రీపై నటుడు నందు క్లారిటీ

పెరగనున్న మొబైల్ చార్జీల ధరలు!