AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సైరా’ మూవీ ఫస్ట్ ‘రివ్యూ’: నేషనల్ అవార్డ్ గ్యారెంటీ!!

మెగా అభిమానులు మాత్రమే కాదు యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 285 కోట్ల భారీ బడ్జెట్‌తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించాడు. అక్టోబర్ 2న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల అయింది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రతో ఈ చిత్రం రూపొందింది. ఇక ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త […]

'సైరా' మూవీ ఫస్ట్ 'రివ్యూ': నేషనల్ అవార్డ్ గ్యారెంటీ!!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 02, 2019 | 7:18 AM

Share

మెగా అభిమానులు మాత్రమే కాదు యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 285 కోట్ల భారీ బడ్జెట్‌తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించాడు. అక్టోబర్ 2న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల అయింది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రతో ఈ చిత్రం రూపొందింది. ఇక ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. మరి ఈ సినిమా ప్రివ్యూ టాక్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా..!

కథ: స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ దొరలు తెలుగు ప్రజలపై పడి.. వారి సొంత భూములలో చాకిరి చేయిస్తూ.. వారికి రావాల్సిన సొమ్ముని అన్యాయంగా స్వాధీనం చేసుకుని.. అష్టకష్టాలు పెడుతున్న రోజులవి. అడ్డం తిరిగిన ప్రజల్ని జాలి, దయ లేకుండా ప్రాణాలు తీస్తున్న రోజులవి..! అలాంటి పరిస్థితుల్లో జమిందారీ అయిన ‘సైరా నరసింహా రెడ్డి’ వారికి ఎలా ఎదురు తిరిగి నిలిచాడు.? వారిని ఎదుర్కొనడానికి ‘సైరా’ వేసిన ఎత్తుగడలు ఏమిటి? మధ్యలో ‘సైరాకి’ సాయం చేసిన వీరులు ఎవరు..? చివరికి ‘సైరా నరసింహా రెడ్డి’ ని ఉరి తీసారా? లేదా..? ఇదే అసలు కథాంశం.

నటీనటులు:

మెగాస్టార్ చిరంజీవి: నటన ఈ చిత్రంలో బాగుంది అనడంలో సందేహం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా జమిందారుగా.. సెకండ్ హాఫ్ అంతా బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటు చేసే వీరుడిగా ఆయన మార్కులు కొట్టేశారు. ఈ క్రమంలో మెగాస్టార్ చేసే కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు ప్రేక్షకులు చేత చప్పట్లు కొట్టించడం ఖాయం.

చిరంజీవికి భార్యగా నయన కూడా బాగా నటించింది. ఈమె క్రేజ్, నటన సినిమాకి అదనపు ఆకర్షణ. అలాగే.. తమన్నా కూడా.. కొత్త పాత్రలో అందరికీ పరిచయం అవుతుంది. సైరాలో ఆమె లుక్‌ మొత్తం సపరేట్ అనే చెప్పలి. ఇక అమితాబ్ గురువు పాత్రలో కేక పుట్టించారు. ఇక జగపతి బాబు, విజయ్ సేతు పతి, సుదీప్ మిగతా తారాగణం సూపర్‌గా నటించి జీవించారనే చెప్పాలి.

blockquote class=”twitter-tweet” data-lang=”en”>

Terrific & Mind Blowing 1st Half ? ? !

Roaring Performance By #MegastarChiranjeevi ?‍♂️ ?‍♂️ ! #SyeRaa ? #SyeRaaNarsimhaReddy

— Sohail Khan (@alwayssohail) October 1, 2019