ఆప్ నేత తాహిర్ హుసేన్ కు ‘దెబ్బ మీద దెబ్బ’ ..పార్టీ నుంచి సస్పెన్షన్.. అరెస్టు

ఢిల్లీ అల్లర్ల సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ మృతికి కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత తాహిర్ హుసేన్ ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. అంకిత్ శర్మ మృతి కేసులో నిందితుడైన ఈయన  పోలీసుల ముందు లొంగిపోయేందుకు రెడీ అయ్యాడు.

ఆప్ నేత తాహిర్ హుసేన్ కు 'దెబ్బ మీద దెబ్బ' ..పార్టీ నుంచి సస్పెన్షన్.. అరెస్టు
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 05, 2020 | 4:48 PM

ఢిల్లీ అల్లర్ల సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ మృతికి కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత తాహిర్ హుసేన్ ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. అంకిత్ శర్మ మృతి కేసులో నిందితుడైన ఈయన  పోలీసుల ముందు లొంగిపోయేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ లొంగుబాటుకు అనుమతించేది లేదని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. దీంతో పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు.  అంకిత్ శర్మ డెడ్ బాడీని గతవారం జఫ్రాబాద్ ప్రాంతంలోని ఓ డ్రెయిన్ నుంచి వెలికి తీసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాహిర్ పేరు బయటికి వఛ్చినప్పటినుంచి ఇతగాడు పరారయ్యాడని పోలీసులు తెలిపారు. కాగా.. ఇక మరో దారి లేక లొంగిపోయేందుకు సిధ్ధపడ్డాడు. అంకిత్ శర్మపై దాడి జరిగినప్పుడు హుసేన్ తన ఇంటిపై తన సహచరులతో రాళ్లు, పెట్రోలు బాంబులతో కనబడిన వీడియో హల్చల్ చేసింది. తన కుమారుడి హత్య వెనుక హుసేన్ ప్రమేయం ఉందని అంకిత్ తండ్రి రవీందర్ శర్మ ఆనాడే ఆరోపించారు. బీజేపీ నేత కపిల్ మిశ్రా కూడా ఆయన ఆరోపణను సమర్థించారు. హుసేన్ పై హత్య, లూటీ ఆరోపణల నేపథ్యంలో ఆప్ అధిష్టానం ఇతనిపై కఠిన చర్యలు తీసుకుంది.