రాజధాని బిల్లుల అమలుపై స్టేటస్ కో పొడిగింపు

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల గెజిట్‌ అమలుపై స్టేటస్‌ - కోను హైకోర్టు పొడిగించింది. వచ్చే నెల 21వ తేదీ వరకు స్టేటస్‌ -కో అమలులో ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది.

  • Tv9 Telugu
  • Publish Date - 1:11 pm, Thu, 27 August 20
రాజధాని బిల్లుల అమలుపై స్టేటస్ కో పొడిగింపు

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల గెజిట్‌ అమలుపై స్టేటస్‌ – కోను హైకోర్టు పొడిగించింది. వచ్చే నెల 21వ తేదీ వరకు స్టేటస్‌ -కో అమలులో ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి రాజధాని అంశంపై దాఖలైన అన్ని పిటీషన్లను రోజు వారీగా విచారణ జరిపేందుకు సిద్ధమని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

రాజధాని, సీఆర్డీఏ చట్టం రద్దుపై గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు ఇవాళ్టితో ముగిశాయి. దీంతో సెప్టెంబర్ 21 వరకు స్టేటస్ కో అమలు గడువును పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజధాని బిల్లులు అమలు చేయకుండా స్టేటస్ కో కొనసాగుతుందని ధర్మాసనం స్పస్టం చేసింది.

మరోవైపు విశాఖలో స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌కు శంకుస్థాపన అంశాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు పిటిషనర్ తరపు న్యాయవాది. కార్య నిర్వాహక రాజధాని తరలింపులో ఇది కూడా భాగమేనని వాదనలు వినిపించారు. స్టేటస్‌ -కో కొనసాగుతుండగా శంకుస్థాపన ఎలా చేస్తారని కోర్టు ప్రశ్నించింది.