కేటీఆర్ మీదనే కేసీఆర్ సిట్ వేయించారు: లోకేశ్
విజయవాడ: తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ మదురుతోంది. నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాను తెలంగాణ నేత కేటీఆర్ దొంగతనం చేస్తే, దానిపై కేసీఆర్ సిట్ వేయించారని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ డేటాను ఇచ్చింది జగన్‌కేననే విషయం తేలుతుందన్నారు. జగన్‌ను కూడా లోకేశ్ విమర్శించారు. “సెల్ఫ్‌గోల్ స్పెషలిస్ట్ జగన్ గారూ! కోడికత్తి కేసు మోడీగారు మోజుపడి ఎన్ఐఏతో దర్యాప్తు చేయించారు. పొడిచింది వైకాపా కార్యకర్త. పొడిపించుకున్నది మీరేనని […]

విజయవాడ: తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ మదురుతోంది. నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాను తెలంగాణ నేత కేటీఆర్ దొంగతనం చేస్తే, దానిపై కేసీఆర్ సిట్ వేయించారని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
ఆ డేటాను ఇచ్చింది జగన్‌కేననే విషయం తేలుతుందన్నారు. జగన్‌ను కూడా లోకేశ్ విమర్శించారు. “సెల్ఫ్‌గోల్ స్పెషలిస్ట్ జగన్ గారూ! కోడికత్తి కేసు మోడీగారు మోజుపడి ఎన్ఐఏతో దర్యాప్తు చేయించారు. పొడిచింది వైకాపా కార్యకర్త. పొడిపించుకున్నది మీరేనని ఎన్ఐఏ తేల్చింది” అని లోకేశ్ ట్వీట్ చేశారు.
సెల్ఫ్‌గోల్ స్పెషలిస్ట్ జగన్ గారూ! కోడికత్తి కేసు మోడీగారు మోజుపడి ఎన్ఐఏతో దర్యాప్తు చేయించారు. పొడిచింది వైకాపా కార్యకర్త. పొడిపించుకున్నది మీరేనని తేల్చింది. #Jagan420
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) March 6, 2019
మీ కోసం చోరీ చేసిన డేటా కేసు దర్యాప్తుకు కేసీఆర్ సిట్ వేయించారు.ఇక్కడ డేటా ఎత్తుకుపోయింది కేటీఆర్..ఇచ్చింది మీకేనని తేలనుంది.#Jagan420
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) March 6, 2019