బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్ పార్టీకి సింధియా రాజీనామా
మధ్యప్రదేశ్ సంక్షోభానికి తెర తీసిన కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా చేశారు.. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ లో పేర్కొన్నారు. ప్రధాని మోదీతో భేటీ అయిన అనంతరం ఆయన రాజీనామా చేశారు.
మధ్యప్రదేశ్ సంక్షోభానికి తెర తీసిన కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా చేశారు.. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ లో పేర్కొన్నారు. ప్రధాని మోదీతో భేటీ అయిన అనంతరం ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు.
అటు-పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనను పార్టీనుంచి బహిష్కరించినట్టు కాంగ్రెస్ ప్రకటించింది. కొంతకాలంగా సింధియా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలకు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో మద్దతునిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మొదటినుంచీ సేవలు అందిస్తూ వస్తున్న తనను పార్టీ పక్కన పెట్టిందని ఆయన తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీంతో సహజంగానే ఆయన కమలం పార్టీవైపు మొగ్గారు.
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) March 10, 2020