నేడు ప్ర‌పంచ జల దినోత్సవం

నేడు ప్ర‌పంచ జల దినోత్సవం

ప్రతి సంవత్సరము మార్చి 22 వ తేదీన ప్రపంచ జల దినోత్సవము నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. మనం నివసించే భూగోళంలో 70 శాతానికిపైగా నీరే. అయితే, ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్ప భాగం మాత్రమే. మొత్తం భూగోళంలోని నీటిలో దాదాపు 2.7 శాతం మాత్రమే శుభ్రమైన నీరు కాగా, ఇందులోనూ 75.2 % ధృవప్రాంతాలలో మంచురూపంలో ఘనీభవించి వుంటే, మరో 22.6 % నీరు భూగర్భంలో వుంది. మిగతా నీరు సరస్సులు, నదులు, వాతావరణం, గాలిలోని […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 22, 2019 | 1:17 PM

ప్రతి సంవత్సరము మార్చి 22 వ తేదీన ప్రపంచ జల దినోత్సవము నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది.

మనం నివసించే భూగోళంలో 70 శాతానికిపైగా నీరే. అయితే, ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్ప భాగం మాత్రమే. మొత్తం భూగోళంలోని నీటిలో దాదాపు 2.7 శాతం మాత్రమే శుభ్రమైన నీరు కాగా, ఇందులోనూ 75.2 % ధృవప్రాంతాలలో మంచురూపంలో ఘనీభవించి వుంటే, మరో 22.6 % నీరు భూగర్భంలో వుంది. మిగతా నీరు సరస్సులు, నదులు, వాతావరణం, గాలిలోని తేమ, భూమిలోని చెమ్మ, చెట్టు చేమలలో వుంటుంది. ఇంతేకాదు, సరస్సులు, నదులు, భూగర్భ జలాలలో కూడా మానవ వినియోగానికి, ఇతర అవసరాలకు చక్కగా ఉపయోగపడగలిగిన నీరు, చాలా కొద్ది పరిమాణం మాత్రమే. ప్రతిరోజూ మనకు కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం. కాని, ఇప్పటికీ, 88.4 కోట్ల మంది ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు.

అభివృద్ధిచెందుతున్న దేశాలలో, తగిన నిబంధనలు, వనరులు లేనికారణంగా, 80 శాతం వ్యర్ధాలను పునర్వినియోగ ప్రక్రియకు మళ్ళించకుండానే పారవేస్తున్నారు. పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక ప్రగతికూడా, కొత్తరకాల కాలుష్యానికి మూలమవుతున్నాయి. ఇదే దామాషాలో, పరిశుభ్రమైన నీటి అవసరం పెరుగుతున్నది. ఈ కారణంగా, ఇటు వర్తమానంలోను, అటు భవిష్యత్తులోను మానవ ఆరోగ్యానికి , పర్యావరణ స్వచ్ఛతకు ముప్పు పొంచివుండగా ; తాగడానికి ఉపయోగపడే పరిశుభ్రమైన నీటికి, వ్యవసాయ అవసరాలకు కావలసిన నీటికి తీవ్రమైన కొరత ఏర్పడుతున్నది. అయినప్పటికి, నీటి కాలుష్యం ‘అత్యవసరంగా దృష్టిసారించవలసిన అంశం’ అనే ప్రస్తావన, అరుదుగా కాని రావడంలేదు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu