కలకలం రేపుతున్న రేవంత్ రెడ్డి ఫిర్యాదు

హైదరాబాద్: కేసీఆర్‌కు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భారీ షాకిచ్చారు. ఎన్నో రోజులుగా పెండింగ్ పడుతూ వచ్చిన తెలంగాణ మంత్రివర్గ విస్తరణను ఆయన ప్రశ్నించారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు 9 మంత్రి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని, ఈ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉటుందని తన ఫిర్యాదులో రేవంత్ పేర్కొన్నారు. […]

కలకలం రేపుతున్న రేవంత్ రెడ్డి ఫిర్యాదు
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:51 PM

హైదరాబాద్: కేసీఆర్‌కు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భారీ షాకిచ్చారు. ఎన్నో రోజులుగా పెండింగ్ పడుతూ వచ్చిన తెలంగాణ మంత్రివర్గ విస్తరణను ఆయన ప్రశ్నించారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు 9 మంత్రి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని, ఈ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉటుందని తన ఫిర్యాదులో రేవంత్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా కేబినెట్‌ను విస్తరస్తే చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఫిర్యాదులో కోరారు. కేంద్ర ఎన్నికల సంఘానికే కాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్‌కు కూడా రేవంత్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫిర్యాదు ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోంది.