నగరంలో హై అలర్ట్.. ఏవోసీ రోడ్లపై ఆంక్షలు

హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధి కంటోన్మెంట్‌లోని ఆర్మీ రహదారులపై మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో దేశంలో హై అలర్ట్ ప్రకటించన నేపథ్యంలో ఏవోసీ రోడ్లపై రాత్రిపూట సాధారణ పౌరుల రాకపోకలను నిషేధించారు. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజున ఉదయం 7 గంటల వరకు ఏవోసీ ఇంటర్నల్ రోడ్లను లోకల్ మిలటరీ అథారిటీ మూసివేస్తోంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. ఏఓసీ రహదారుల మూసివేసే […]

నగరంలో హై అలర్ట్.. ఏవోసీ రోడ్లపై ఆంక్షలు
Follow us

| Edited By:

Updated on: Mar 03, 2019 | 8:13 AM

హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధి కంటోన్మెంట్‌లోని ఆర్మీ రహదారులపై మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో దేశంలో హై అలర్ట్ ప్రకటించన నేపథ్యంలో ఏవోసీ రోడ్లపై రాత్రిపూట సాధారణ పౌరుల రాకపోకలను నిషేధించారు. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజున ఉదయం 7 గంటల వరకు ఏవోసీ ఇంటర్నల్ రోడ్లను లోకల్ మిలటరీ అథారిటీ మూసివేస్తోంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. ఏఓసీ రహదారుల మూసివేసే సమయానికి సంబంధించిన సైన్ బోర్డులను ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కాగా లోకల్ మిలటరీ యం త్రాంగం మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడంలేదు.

రక్షణ శాఖ పరిధిలోని అర్మీ అర్డీనెన్స్ కార్ఫ్(ఏవోసీ) అంతర్గత రోడ్లపై రాత్రిపూట సాధారణ ప్రజానీకం రాకపోకలను నిషేధించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఆయా రోడ్లపై ఆంక్షలు కొనసాగుతాయి. రక్షణశాఖ అధికారులు అంతర్గత రోడ్లను మూసివేయడంతో ఆ రోడ్లతో లింక్ ఉన్న న్యూ గాంధీనగర్, శక్తినగర్,రామకృష్ణాపురం,మల్కాజిగిరి, సఫిల్‌గూడ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన రాకపోకలు తెగిపోనున్నాయి. ఇప్పటికే లోకల్ మిలటరీ అధికారులు గేట్ల ఏర్పాటు చేశారు.. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తూ.. సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల అదేశాల మేరకు సైన్ బోర్డులు ఏర్పాటు ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు.