పాములు ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇవి చాలా రకాలు ఉంటాయి. ఇక పాములు అంటే అందరికీ పాకేవి మాత్రమే తెలుసు కానీ పైకి ఎగిరే పాములు కూడా ఉంటాయంట.
పాములు
కాగా, ఇప్పుడు మనం పైకి ఎగిరే పాములు ఎక్కడుంటాయి. వాటి గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం పదండి మరి.
ఎగిరే పాములు
ప్రకృతి ఎన్నో రకాల వింత జీవులు ఉంటాయి. అవి తమకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అయితే చాలా మందికి ఎగిరే పాములు ఉంటాయని కూడా తెలియదు. కానీ ఎగిరే పాములు కూడా ఉంటాయంట.
ప్రకృతి
ఎగిరే పాములు ఎక్కడో కాదు, ఆగ్నేయ ఆసియాలో ఇవి ఎక్కువగా ఉంటాయంట. ఇవి చాలా భయంకరంగా, చూడగానే భయం వేసేలా ఉంటాయంట.
ఆగ్నేయాసియా
ఇక ఈ ఎగిరే పామును శాస్త్రీయంగా, క్రైసోపిలియా అని అంటారు. ఇవి ఎక్కువగా భారత దేశం, శ్రీలంక, చైనా, ఇండోనేషియాలో కనిపిస్తాయి.
క్రైసోపిలియా
ఎగిరే పాములు భూమిపై ఎక్కువగా కనిపించవు, ఇవి ఎక్కువగా చెట్లపై కొమ్మలకు చుట్టుకుని ఉంటాయంట. ఇవి చెట్లపైనే ఎక్కువగా నివసిస్తాయి.
చెట్లపై
ఇక ఈ పాములు ఆహారం కోసం ఒక చెట్టు నుంచి మరో చెట్టుపైకి దూకుతాయంట. అంతే కాకుండా ఒకే చెట్టు పై ఇవి ఎక్కువగా ఉండవంట.
దూకడం
ఎక్కువగా ఒక చెట్టు నుంచి మరో చెట్టు పైకి దూకుతూ.. తమ చోటును మార్చుకుంటూ ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.