సరస్సులను చూస్తే ముక్కు మూసుకుంటుంది.. సంవత్సరానికి ఒకసారి నీరు తాగుతుంది.ఈ పక్షి గురించి తెలుసా?
Samatha
18 January 2026
ప్రకృతిలో ఎన్నో వింతలు దాగున్నాయి. సైన్స్ కూడా అందని ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.
ప్రకృతి
ఇక భూ ప్రపంచం మీద ఎన్నో పక్షుల ఉన్నాయి. ప్రతి పక్షికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అదే విధంగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే నీళ్లు తాగే పక్షి కూడా ఉంది.
పక్షులు
చాతక పక్షి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నీరు తాగుతుందంట. దీని ప్రత్యేకత ఇదే, అంతే కాకుండా ఇది నీరు కూడా ఒక స్పెషల్ డే రోజు మాత్రమే తాగుతుంది. దాని గురించి తెలుసుకుందాం.
సంవత్సరానికి ఒకసారి
ఇది ఎంత దాహంగా ఉన్నా సరే నీటిని సేవించదంట. స్వచ్ఛమైన నీటి సరస్సును దాని ముందు పెట్టినా అది నీళ్లు తాగదంట. అది కేవలం మొదటి వర్షపు బిందువుల నీటిని మాత్రమే సేవిస్తుందంట.
మొదటి వర్షపు బిందువులు
ఎక్కడ నీరు కనిపించినా, ఈ పక్షి నీటిని తాగకుండా ముక్కును మూసుకుంటుందంట. ఆ సరస్సుల నీళ్లు కూడా దాని నోటిలోకి వెళ్లకుండా చూసుకుంటుందంట.
నీరు
చాతక పక్షి కేవలం స్వాతి నక్షత్రంలో కురిసే వర్షపు నీటిని మాత్రమే తాగుతుందంట. అది స్వచ్ఛమైన నీరును తాగి తృప్తి పడుతుంది. మళ్లీ సంవత్సరం వరకు నీటిని సేవించదంట.
స్వాతి నక్షత్రంలో కురిసే వర్షపు నీరు
అందుకే ఈ పక్షిని చాలా ప్రత్యేకమైనదిగా చూస్తారు. అంతే కాకుండా ఆధ్యాత్మికం ప్రకారం కూడా ఈ పక్షిని చూడటం చాలా మంచిదని చెబుతుంటారు.
ఆధ్యాత్మికం
ఇక పక్షులు తమ గూళ్ళలో కాకుండా, ఇతర పక్షుల గూటిలో గుడ్లు పెడుతుంటాయి. ఇవి ప్రపంచంలో కెళ్లా వింతైన పక్షులు అని చెప్పవచ్చు.