చంద్రబాబుకు బిగ్ షాక్… చెల్లని నాలుగు ఓట్లు
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు బిగ్ ఝలక్ ఇచ్చారు. తమ ఓటును టీడీపీ నిలిపిన రాజ్యసభ అభ్యర్థి వర్ల రామయ్యకు వేసినట్లుగా చెప్పారు. కానీ ఇక్కడే పెద్ద మెలిక పెట్టారు. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగు చెల్లని ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత వద్ద “1” అని నెంబర్ వేయకుండా టిక్ మార్క్ పెట్టారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, చీరాల శాసన సభ్యుడు కరణం బలరాం ఈ చెల్లని […]

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు బిగ్ ఝలక్ ఇచ్చారు. తమ ఓటును టీడీపీ నిలిపిన రాజ్యసభ అభ్యర్థి వర్ల రామయ్యకు వేసినట్లుగా చెప్పారు. కానీ ఇక్కడే పెద్ద మెలిక పెట్టారు. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగు చెల్లని ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత వద్ద “1” అని నెంబర్ వేయకుండా టిక్ మార్క్ పెట్టారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, చీరాల శాసన సభ్యుడు కరణం బలరాం ఈ చెల్లని ఓట్లు వేసినట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు.
మరో నేత కూడా టీడీపీకి చెందిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అని తెలిసింది. వీరంతా టీడీపీకి ఓటు వేసినప్పటికీ.. నిబంధనల ప్రకారం వేయకపోవడంతో అవి చెల్లకుండాపోయాయి. వీరంతా తెలుగు దేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు కావడం విశేషం.




