బండ్ల జేబులో బొత్స.. ఇరకాటంలో పీవీపీ కామెంట్స్..!
టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలియని వారుండరు. గబ్బర్ సింగ్ మూవీతో ప్రొడ్యూసర్‌గా మారి.. వివిధ సినిమాలు నిర్మించారు. కాగా.. బండ్ల గణేష్‌కి వివాదాలు కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో కీ పాయింట్‌గా నిలుస్తూంటారు. పొలిటీషియన్‌గా కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. గత తెలంగాణ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే.. నా నాలుక కోసుకుంటా అని ప్రతిజ్ఞ చేశాడు. ఎన్నికల ఫలితాల […]
టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలియని వారుండరు. గబ్బర్ సింగ్ మూవీతో ప్రొడ్యూసర్‌గా మారి.. వివిధ సినిమాలు నిర్మించారు. కాగా.. బండ్ల గణేష్‌కి వివాదాలు కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో కీ పాయింట్‌గా నిలుస్తూంటారు. పొలిటీషియన్‌గా కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. గత తెలంగాణ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే.. నా నాలుక కోసుకుంటా అని ప్రతిజ్ఞ చేశాడు. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలవలేదు.. అప్పుడు మాట మార్చి ఇలాంటివి ఎన్నో అనుకుంటూంటాం అన్నీ నిజమవుతాయా అంటూ.. ఈజీగా మాట దాటివేశారు.
తాజాగా.. బండ్ల గణేష్‌పై వైసీపీ నేత, నిర్మాత పీవీపీ పోలీస్ కేస్ పెట్టారు. ‘టెంపర్’ సినిమాకు గాను పీవీపీ నుంచి కొంతమేర డబ్బు తీసుకున్న పీవీపీ.. సినిమా విడుదల సమయంలో.. చెక్కుల రూపంలో 23 కోట్లను ఇచ్చాడు. ఇంకా రూ.7 కోట్లు.. ఇవ్వాల్సి ఉంది. కాగా.. మిగిలిన అమౌంట్ ఇంకా రాకపోవడంతో.. గతరాత్రి బండ్ల గణేష్‌కు ఫోన్ చేసి.. పీవీపీ డబ్బులు అడిగారు. దీంతో.. బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేసి.. రాత్రి పీవీపీ ఇంటిపై దాడి చేసి.. అనుచరులతో కలిసి వెళ్లి బెదిరించాడు. ఆ తర్వాత జూబ్లిహిల్స్ పీఎస్‌లో.. బండ్ల గణేష్‌పై పోలీసులకు పీవీపీ ఫిర్యాదు చేశారు. దీంతో.. బండ్లగణేష్ సహా మరో నలుగురిపై.. పోలీసులు కేసులు నమోదు చేశారు.
అయితే.. పీవీపీనే నన్ను బెదిరించాడని.. లేకుంటే కిడ్నాప్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడంటూ.. తిరిగి పీఎస్‌లో కేసు బుక్ చేసిన బండ్ల గణేష్. దానికి సంబంధించిన కాపీలను కూడా ట్వీట్టర్‌లో ట్వీట్ చేశాడు. కాగా.. బండ్ల గణేష్ ఇది వరకు కూడా ఇలానే.. చాలా సినిమాలకు డబ్బుల విషయంలో హ్యాండ్ ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సచిన్ జోషి హీరోగా చేసిన ‘నీ జతగా నేనుండాలి’, రాంచరణ్ హీరోగా వచ్చిన ‘గోవిందుడు అందరివాడే’, ఇప్పుడు ‘టెంపర్’ సినిమా విషయంలో వివాదాలున్నాయి.
అయితే.. వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ తన వెనుక ఉన్నాడని.. అందుకే.. ఇలా మోసం చేయడానికి కూడా బండ్ల గణేష్ వెనుకాడటం లేదని పీవీపీ హాట్‌గా కామెంట్ చేశారు. ఏదేమైనా.. ఇప్పుడు బండ్ల గణేష్ వ్యవహారం.. అటు పొలిటికల్‌గా కూడా హీట్‌ని రాజేస్తుంది.