ఏజెన్సీ ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో 4 గంటలకు పోలింగ్‌ ముగిసింది. అయితే సాయంత్రం 4 గంటల లోపు క్యూలైన్‌లో ఉన్నవారు మాత్రం ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన సంగతి చేసిన విషయం తెలిసిందే. అందుకే  నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా కొన్ని చోట్ల ఈసీ త్వరగా పోలింగ్‌ను పూర్తి చేసింది. తెలంగాణలోని చెన్నూరు, మంథని, భూపాలపల్లి, బెల్లంపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్‌, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ […]

ఏజెన్సీ ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 11, 2019 | 4:57 PM

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో 4 గంటలకు పోలింగ్‌ ముగిసింది. అయితే సాయంత్రం 4 గంటల లోపు క్యూలైన్‌లో ఉన్నవారు మాత్రం ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన సంగతి చేసిన విషయం తెలిసిందే. అందుకే  నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా కొన్ని చోట్ల ఈసీ త్వరగా పోలింగ్‌ను పూర్తి చేసింది. తెలంగాణలోని చెన్నూరు, మంథని, భూపాలపల్లి, బెల్లంపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్‌, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏజెన్సీ గ్రామాలతో పాటు ఏపీలోని అరకు, పాడేరు, రంపచోడవరం ప్రాంతాల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది.