Breaking News డీఎస్పీ అనుమానాస్పద మృతి
విశాఖ నగరంలోని అప్పుగర్ ప్రాంతంలో ఓ పోలీసు ఉన్నతాధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న...

DSP level police officer committed suicide in Visakhapatnam city: విశాఖ నగరంలోని అప్పుగర్ ప్రాంతంలో ఓ పోలీసు ఉన్నతాధికారి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణవర్మ శుక్రవారం మధ్యాహ్నం విశాఖనగరంలోని అప్పుగర్ ప్రాంతంలో తన నివాసంలో మరణించారు. తన నివాసంలో ఫ్యానుకు ఉరి వేసుకున్నారని ముందుగా ప్రచారం జరిగినా పోలీసుల కథనం వేరేగా వుంది.
శ్రీకాకుళం జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా పని చేస్తున్న కృష్ణవర్మ విశాఖపట్నంలోని అప్పుగర్ ఏరియాలో నివాసముంటున్నారు. కొద్ది రోజులుగా ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఆయన లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారన్న ప్రచారం కూడా వుంది. లంగ్ క్యాన్సర్‌కు కొంత కాలంగా ట్రీట్ మెంటు తీసుకుంటున్న కృష్ణ వర్మ ఇటీవల కాలంలో తీవ్రమైన మనో వేదనకు గురయ్యారని అంటున్నారు.




