లైవ్ అప్‌డేట్స్: బడ్జెట్‌పై మరోసారి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్
ఇవాళ కూడా సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ మరో రంగానికి సంబంధించిన ఆర్థిక ప్యాకేజీ వివరాలను ఆమె వెల్లడించనుండగా, ఏం ప్రకటిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విడతల వారీగా ఆర్థిక ప్యాకేజీ వివరాలు వెల్లడిస్తామని బుధవారం మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ గురించి.. గురువారం వివరాలను వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీలో […]

ఇవాళ కూడా సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ మరో రంగానికి సంబంధించిన ఆర్థిక ప్యాకేజీ వివరాలను ఆమె వెల్లడించనుండగా, ఏం ప్రకటిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విడతల వారీగా ఆర్థిక ప్యాకేజీ వివరాలు వెల్లడిస్తామని బుధవారం మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ తెలిపారు.
కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ గురించి.. గురువారం వివరాలను వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీలో భాగంగా ఈ రోజు తొమ్మిది విభాగాల కేటాయింపుల గురించి వివరించారు. వలస కార్మికులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి, చిన్న, సన్నకారు రైతులు, ముద్ర యోజన, హౌసింగ్, ఉద్యోగ కల్పన తదితర విభాగాలకు కేటాయించిన వాటి గురించి తెలిపారు.
ఈ సందర్భంగా.. ఇన్ టైంలో లోన్స్ చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీపై రాయితీని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు సన్న కారు రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడంతో పాటుగా.. గిరిజనులకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. అంతేకాదు.. ఇకపై దేశ వ్యాప్తంగా ఒకే విధంగా కనీస వేతనం అమలయ్యేలా చూస్తామన్నారు. రేషన్ కార్డుల విషయంలో కూడా.. ఆగస్టు నుంచి వన్ నేషన్ వన్ కార్డు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,5:06PM” class=”svt-cd-green” ] అంతరాష్ట్ర రవాణాలకు అడ్డంకులు తొలగింపు. రైతులు తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల్లో కూడా అమ్ముకునేలా చర్యలు. వ్యవసాయ ఉత్పత్తులకు ఈ-ట్రేడింగ్: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,5:03PM” class=”svt-cd-green” ] రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రత్యేక చర్యలు. నిత్యావసర సరుకుల చట్టంలో సవరణలు. వంట నూనె, విత్తనాలు, ఉల్లి, పప్పు ధాన్యాల ధరలపై నియంత్రణ తొలగింపు. అత్యవసర సమయంలోనే వంటనూనె, పప్పు ధాన్యాల, విత్తనాలు, ఆలుగడ్డ, ఉల్లి ధరల నియంత్రణ. లైసెన్స్‌డ్ మార్కెటింగ్ కంపెనీల వద్దే రైతుల తమ ఉత్పత్తులు అమ్మాలి: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,4:55PM” class=”svt-cd-green” ] వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌కు రూ.500కోట్లు. రైతు ఉత్పత్తుల రవాణా, కోల్డ్ స్టోరేజీ చార్జీలపై 50శాతం రాయితీ. పండ్లు, కూరగాయల రైతులకు ప్రయోజనం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,4:55PM” class=”svt-cd-green” ] తేనేటీగల పెంపక ప్రోత్సాహం రూ.500 కోట్లు. దీని వలన 2లక్షల మందికి ప్రయోజనం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,4:50PM” class=”svt-cd-green” ] ఔషద మొక్కల సాగుకు రూ.4వేల కోట్లు. దేశవ్యాప్తంగా 2.25లక్షల హెక్టార్ల మెడిసినల్ ప్లాంట్ల సాగు. మరో రెండేళ్లలో మరో లక్ష హెక్టార్లలో విస్తరణ. దీనివల్ల రైతులకు రూ.5వేల కోట్ల ఆదాయం. స్థానికంగా మార్కెటింగ్ సదుపాయం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,4:48PM” class=”svt-cd-green” ] పశువుల్లో వ్యాధుల నియంత్రణకు రూ.13,343 కోట్లు. పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులకు 100 శాతం వ్యాక్సినేషన్. 53కోట్ల జంతువులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,4:47PM” class=”svt-cd-green” ] వచ్చే ఐదేళ్లలో 70లక్షల టన్నుల చేపల ఉత్పత్తికి ప్రణాళిక. మత్స్య పరిశ్రమలో 55లక్షల మందికి ఉపాధి. లక్ష కోట్ల ఎగుమతుల లక్ష్యం. చేపల వేటపై నిషేధం ఉన్న సమయంలో వ్యక్తిగత బీమాతో పాటు పడవలకు ఇన్సూరెన్స్: : నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,4:44PM” class=”svt-cd-green” ] ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు రూ.20వేల కోట్ల కేటాయింపు. రొయ్య సాగు, చేపల వేటకు రూ.11 వేల కోట్ల కేటాయింపు. ఫిషింగ్ హార్బర్లు, కోల్డ్ స్టోరేజ్‌లకు రూ.9వేల కోట్లు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,4:41PM” class=”svt-cd-green” ] ఆక్వా రైతుల ఎగుమతుల కోసం కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం రూ.10 వేల కోట్ల నిధి: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,4:40PM” class=”svt-cd-green” ] పాల సేకరణ రంగం సంక్షోభంలో ఉంది. లాక్‌డౌన్‌తో పాల ఉత్పత్తి వాడకంలో 20 నుంచి 25శాతం క్షీణత: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,4:37PM” class=”svt-cd-green” ] మత్య్సకారుల కోసం 4 ప్రత్యేక పథకాలు. రొయ్యి సాగుకు ప్రత్యేక రాయితీలు. కొత్తగా 242 హేచరీలను రిజిస్ట్రేషన్ చేశాం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్'” date=”15/05/2020,4:28PM” class=”svt-cd-green” ] వ్యవసాయానికి కేటాయించిన నిధుల నుంచి గోదాముల, కోల్డ స్టోరేజ్‌ల నిర్మాణం. గ్రామీణ ఆహారోత్పత్తుల బ్రాండింగ్ కోసం ప్రత్యేక నిధి: నిర్మలా [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,4:24PM” class=”svt-cd-green” ] పాల ఉత్పత్తిదారుల కోసం ప్రత్యేక పథకం. 2వేల మంది రైతుల కోసం రూ.5వేల కోట్ల నిధులు మంజూరు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,4:22PM” class=”svt-cd-green” ] రైతుల నుంచి 11 కోట్ల లీటర్ల పాల సేకరణ రూ.4100 కోట్లు ఖర్చు చేశాం: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,4:21PM” class=”svt-cd-green” ] లాక్‌డౌన్ సమయంలో పాల డిమాండ్ 20-25శాతం తగ్గింది. సహకార సంఘాలు 560 లక్షల లీటర్ల స్థానంలో 360 లక్షల లీటర్లు మాత్రమే విక్రయించాయి: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,4:18PM” class=”svt-cd-green” ] పీఎం ఫసల్ బీమా యోజన కింద రూ.6400 కోట్ల చెల్లింపులు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,4:18PM” class=”svt-cd-green” ] పీఎం కిసాన్ ఫండ్ కింద రూ.18,700 కోట్లు పంపిణీ: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,4:15PM” class=”svt-cd-green” ] లాక్‌డౌన్ సమయంలో రైతుల నుంచి రూ.74,300 ధాన్యం కొనుగోలు: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,4:11PM” class=”svt-cd-green” ] రైతులను ఆదుకోవడానికి 11 పాయింట్ ఫార్ములా: నిర్మలా సీతారామన్ [/svt-event]
[svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్” date=”15/05/2020,4:07PM” class=”svt-cd-green” ] దేశంలో 85శాతం మంది వ్యవసాయం చేస్తున్నారు: నిర్మలా సీతారామన్ [/svt-event]
Read More:
మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగలు



