స్టైరినే కాదు మరిన్ని విషవాయువులున్నాయి.. తేల్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్

ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ఒక్క స్టైరిన్ వాయువే కాదని.. మరికొన్ని విషవాయువులు కూడా విడుదలయ్యాయని కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. ఇందులో 80 శాతం వరకూ అత్యధిక గాడతతో స్టైరిన్ ఆవిరి...

స్టైరినే కాదు మరిన్ని విషవాయువులున్నాయి.. తేల్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్
Follow us

| Edited By:

Updated on: May 15, 2020 | 2:07 PM

విశాఖ గ్యాస్ లీక్‌ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఒక వైపు కరోనా వైరస్‌తో పోరాడుతుంటే.. మరో వైపు ఈ ఘటన జగన్ సర్కార్‌కి మరింత కష్టం తీసుకొచ్చి పెట్టింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, దాదాపు వందమందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ఒక్క స్టైరిన్ వాయువే కాదని.. మరికొన్ని విషవాయువులు కూడా విడుదలయ్యాయని కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. ఇందులో 80 శాతం వరకూ అత్యధిక గాడతతో స్టైరిన్ ఆవిరి, 20 శాతం ఇతర వాయువులు ఉన్నాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

సంస్థ పరిసరాల్లో స్టైరిన్‌తో పాటు పలు హైడ్రోకార్బన్ల జాడను గుర్తించారు. వాటన్నింటినీ కలిపి T.V.O.C టోటల్ ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్‌గా పేర్కొన్నారు. ట్యాంకులో ఉష్టోగ్రత పెరిగిన కారణంగా స్టైరిన్ రసాయనిక చర్యకు గురై పాలిమరైజేషన్ చెందిందన్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో విడుదలైన స్టైరిన్‌ ఆవిరిలో బెంజీన్, ఇథలీన్ తదితర వాయువులున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది.

అయితే రసాయనాల్ని భారీగా వినియోగంచే సంస్థలు సాధారణంగా నిపుణుల్ని నియమించుకుంటాయి. ప్రమాదాలకు గల అవకాశాలు.. ఒకవేళ జరిగినప్పుడు తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారు చెప్పగలుగుతారు. అయితే ఈ ఘటనలో అక్కడ రసాయన శాస్త్రవేత్తలు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం జరిగిందన్నారు. కాగా ఈ ప్రమాదంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు బృందాలతో విశాఖలోని 20 కర్మాగారాల్లో తనిఖీలు చేయిస్తోంది.

Read More:

మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగలు

రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నేరుగా అకౌంట్లలో నగదు జమ

ఏపీలో జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపా? సడలింపా?