ఆర్ధిక సంస్కరణల బూస్ట్.. మోదీకి బడా సవాల్

రెండోసారి దేశ ప్రధాని అయిన మోదీ ముందు ప్రస్తుతం ఆర్ధిక రంగానికి సంబంధించి పెద్ద సవాల్ నిలిచింది. తన గత ప్రభుత్వపు అయిదేళ్ల కాలంలో దేశ ఆర్ధిక వ్యవస్థ మందగమనంలో నడిచింది. ఇప్పుడు మోదీ మళ్ళీ దీన్ని గాడిలో పెట్టాలంటే.. ఆర్ధిక పునరుజ్జీవం జరగాలంటే దాదాపు 190 బిలియన్ డాలర్ల మేర రుణాలను రాబట్టాల్సిందే. ఆర్ధిక సంస్కరణలను తప్పనిసరిగా చేపట్టాల్సిందే. బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా చేతులెత్తేసిన ఘనాపాటీల కారణంగా […]

ఆర్ధిక సంస్కరణల బూస్ట్.. మోదీకి బడా సవాల్
Follow us

|

Updated on: Jun 06, 2019 | 4:21 PM

రెండోసారి దేశ ప్రధాని అయిన మోదీ ముందు ప్రస్తుతం ఆర్ధిక రంగానికి సంబంధించి పెద్ద సవాల్ నిలిచింది. తన గత ప్రభుత్వపు అయిదేళ్ల కాలంలో దేశ ఆర్ధిక వ్యవస్థ మందగమనంలో నడిచింది. ఇప్పుడు మోదీ మళ్ళీ దీన్ని గాడిలో పెట్టాలంటే.. ఆర్ధిక పునరుజ్జీవం జరగాలంటే దాదాపు 190 బిలియన్ డాలర్ల మేర రుణాలను రాబట్టాల్సిందే. ఆర్ధిక సంస్కరణలను తప్పనిసరిగా చేపట్టాల్సిందే. బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా చేతులెత్తేసిన ఘనాపాటీల కారణంగా ఒక్కసారిగా సంక్షోభం తలెత్తింది. ఇటీవలి నెలల్లో కన్స్యూమర్ స్పెండింగ్ (వినియోగదారుల వ్యయాలు) చాలావరకు దెబ్బతిన్నాయి. అంటే వారి నెత్తిన ధరల భారం మోపెడంత పడింది. సామాన్యుల ఆర్ధిక లావాదేవీలు అంతకంతకూ తగ్గుతూ వచ్చ్చాయి. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు పెరిగిపోగా.. వీటి ‘ స్లగ్గిష్ గ్రోత్ ‘ ఎకానమీకి గ్రహణం పట్టేలా చేసింది. ప్రయివేటు పెట్టుబడులు పెరిగితేనే పరిస్థితి కొంతలో కొంతయినా మెరుగుపడుతుందని ఆర్ధిక నిపుణులు పేర్కొంటున్నారు. మోదీ తొలి ప్రభుత్వ హయాంలో బడా డీఫాల్టర్ల ఆస్తుల సీజ్, వాటి అమ్మకాలతో బ్యాంకులు తమ ‘ బ్యాడ్ డెట్ రికవరీ ‘ నుంచి కొంత కోలుకోగలిగాయి. అయితే కోర్టుల్లో కేసులు, విచారణలో జాప్యాలతో ద్రవ్య లావాదేవీలు ఆలస్యమవుతూ వచ్చాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు కూడా వెనక్కి తగ్గారు. బ్యాంక్ రప్టసీకి సంబంధించిన చట్టాన్ని తరచూ సమీక్షిస్తుండాలని ఎస్ బీ ఐ చైర్మన్ రజనీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. గత మార్చినాటికి ఈ కేసులు చట్టం నిర్దేశించిన 270 రోజుల డెడ్ లైన్ ని దాటిపోయాయని ఆయన అంటున్నారు. అటు-జడ్జీల కొరత, తగినన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడం వంటివిసమస్యను మరింత జటిలం చేస్తూ వచ్చాయి. ఇలాంటి పరిణామాలు ఆర్ధిక వ్యవస్థను కొంత దాదాపు దెబ్బ తీసే పరిస్థితికి దారి తీశాయి.బ్యాంకులు ఇప్పటివరకు సుమారు 11 బిలియన్ డాలర్ల విలువైన (43 శాతం) ఆస్తులను స్వాధీనం చేసుకోగలిగాయి. అటు-రిజర్వ్ బ్యాంకు కూడా తాజా పరిస్థితిని అధ్యయనం చేసి..డీఫాల్టర్ల ఆస్తుల స్వాధీన విషయంలో మరింత కఠిన చర్యలు తీసుకోవలసిఉంటుందని అంటున్నారు.

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..